Bhavana: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు భావన. ఈ మలయాళ భామ 2008లో వచ్చిన ఒంటరి సినిమాతో తెలుగులో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు హిట్టు సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడలోనూ సినిమాలు చేశారు. మలయాళంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో ఆమెపై లైంగిక దాడి జరిగింది. ప్రముఖ మలయాళ నటుడు దిలీప్.. భావనపై ఉన్న పగతో ఆ దాడి చేయించారు. తన మనుషులతో ఆమెను కిడ్నాప్ చేయించి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన 2017, ఫిబ్రవరి నెలలో జరిగింది. లైంగిక దాడి జ్ఞాపకాలనుంచి బయట పడటానికి ఆమెకు చాలా టైం పట్టింది.
ఓ సంవత్సరం పాటు సినిమాలకు దూరం అయ్యారు. తర్వాత కోలుకుని సినిమాలు చేయటం మొదలుపెట్టారు. అయినప్పటికి ఇళ్లు విడిచి బయటకు రావటానికి భావన పెద్దగా ఇష్టపడటం లేదు. అవసరం అయితేనే బయటకు వస్తున్నారు. అలాంటి ఆమెపై నెటిజన్ల పరుష పదజాలాలు ఎక్కువయిపోయాయి. తాజాగా, ఆమె డ్రెస్‌పై కొందరు నెటిజన్‌లు వల్గర్‌గా కామెంట్లు చేశారు. ఆమెకు దూరంగా ఉండండి లేదంటే మీ మీద కూడా లైంగిక దాడి కేసు పెడుతుంది అని కూడా అన్నారు. ఈ కామెంట్లపై భావన స్పందించారు. బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘‘ అంతా సర్ధుకుంటుందని ప్రతి రోజు నాకు నేను చెప్పుకుని బతుకుతున్నాను. నా వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాలోని బాధను దూరంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఏం చేశానో అది అనవసరం. నన్ను బూతు మాటలతో వేధించారు. నాకు తెలుసు! చాలా మంది నన్ను మళ్లీ చీకట్లోకి పంపాలని చూస్తున్నారు. వాళ్లు దాంతోనే ఆనందం పొందుతారని నాకు అర్థం అయింది. మీరు కూడా అలానే సంతోషాన్ని పొందుతున్నారు. నేను వారిని ఆక్షేపించాలనుకోవటం లేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు భావనకు అండగా నిలుస్తున్నారు.