బండ్ల గణేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం నిర్మాతగా మారారు. ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికి.. రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతానికైతే రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన తన ఫుల్ ఫోకస్‌ని సినిమాల మీదనే పెట్టారు. అయితే మొదటి నుంచి బండ్ల గణేష్ మాటలు, ట్వీట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన మైక్ పట్టుకుంటే నోటి వెంట ఏమొస్తుందో ఆయనకే తెలియదని కొందరి అభిప్రాయం. ఈ మధ్యనే పూరీ జగన్నాథ్ పై మాట్లాడి.. ఆయననూ అలాగే ఇరుకున పెట్టాడు. ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు తండ్రైన సందర్భంగా ఆయనకి విషెష్ తెలియజేస్తూ బండ్ల గణేష్ ట్వీట్ పెట్టాడు. ఆయన చేసిన చిన్న పొరపాటుకు దారుణమైన ట్రోలింగ్ వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు భార్య వైగా రెడ్డి(తేజస్విని) ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిని సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయం తెలిసి.. ఇండస్ట్రీ ప్రముఖులు.. దిల్ రాజు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా దిల్ రాజు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. దిల్ రాజు అన్నకి కంగ్రాట్స్ అంటూ.. దిల్ రాజు సిని నిర్మాణ సంస్థని ట్యాగ్ చేయబోయి పొరపాటున వేరే నిర్మాతను ట్యాగ్ చేయడంతో బండ్ల గణేష్ మరోసారి ట్రోలింగ్ మెటీరియల్‌గా మారారు. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్(SVC), కానీ బండ్ల గణేష్.. ట్యాగ్ చేసింది మాత్రం SVCC. ఈ బ్యానర్ సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్.
దీంతో “ఏంటి బండ్లన్నా.. తండ్రి అయ్యింది దిల్ రాజు అయితే.. బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి కంగ్రాట్స్ చెప్తున్నావు” అని నెటిజన్లు ఓ రేంజ్లో బండ్ల గణేష్‌ని ట్రోల్ చేస్తున్నారు. పొరపాటున ట్యాగ్ చేశావులే కానీ.. కనీసం డిలేట్ చేసి మరొక పోస్ట్ పెట్టొచ్చు కదా! బండ్లన్న అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dil Raju annaaaaaaaaaa congratulations 🏹🏂🏆was blessed with a baby boy 👦 @SVCCofficial
— BANDLA GANESH. (@ganeshbandla) June 29, 2022