సాధారణంగా రాజకీయాలలో ఉండేవారు ఏదొక పదవి చేపట్టి ఆ తర్వాత రాజకీయాలకు వీడ్కోలు పలకడం చూస్తుంటాం. సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై రాజకీయాల్లో కనిపించబోనని చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశాడు. తాను రాజకీయాల నుండి ఎందుకు తప్పుకుంటున్నాడో కారణం కూడా చెప్పాడు. అంతేగాక తాను ఏదైనా తప్పు చేసుంటే క్షమించాలని కోరాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ రాజకీయాలకు వీడ్కోలు పలికిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇన్ని రోజులు అటు సినిమాలకు దూరంగా ఉంటూ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్న గణేష్.. ఒక్కసారిగా గుడ్ బై చెప్పడం చర్చలకు దారితీసింది. బండ్ల్ గణేష్ ట్వీట్ చేస్తూ.. “నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, నాకున్న పనులు, వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు’ అన్నాడు.
అంతేకాకుండా “అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్” అని ట్వీట్స్ లో రాసుకొచ్చాడు. బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అదే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుండి బండ్ల గణేష్ పాలిటిక్స్ లో పెద్దగా కనిపించలేదు. కానీ.. అడపాదడపా పాలిటిక్స్ పై స్పందిస్తుండేవాడు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేశాడు.
నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు….2
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022
…..అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్..🙏
— BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2022