బాలకృష్ణ అనగానే కోపం, ఫ్యాన్స్ మీద విరుచుకుపడతాడు ఇలాంటి విషయాలే వినిపిస్తాయి. కానీ నా అనుకున్నవాళ్లకు కష్టం వస్తే ఆయన ఎంత విలవిల్లాడతారో.. వారి కోసం ఎంత తపిస్తారో తాజాగా తెలిసింది. తారకరత్న అనారోగ్యానికి గురైన నాటి నుంచి బాలయ్య వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ప్రస్తుతం తారకరత్న కోసం బాలయ్య మరో త్యాగం చేశారు. అది ఏంటంటే..
మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. తన వాళ్లు ఎవరో.. పరాయి వాళ్లు ఎవరో తెలుస్తుంది. ఓ కవి అన్నట్లు జీవితంలో నిజమైన ఆప్తులు ఎవరో తెలియాలంటే బలమైన కష్టాలు రావాలి అనే మాట నూటికి నూరు శాతం నిజం. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి చూస్తే ఇది నిజం అనిపిస్తుంది. అన్ని బాగునప్పుడు అందరూ మన చుట్టూ చేరతారు. కష్టం వస్తే.. ఆప్తులు మనకు అండగా నిలుస్తారు. తారకరత్న విషయంలో నందమూరి బాలకృష్ణ కనబరుస్తోన్న శ్రద్ధ చూస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. తారకరత్న అస్వస్థతకు గురైనప్పటి నుంచి బాలకృష్ణ తనను అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుతున్న సంగతి తెలిసిందే. కుప్పం ఆస్పత్రిలో చేర్చింది మొదలు బెంగళూరు హృదయాలయ ఆస్పత్రికి తరలించే వరకు.. తారకరత్న వెంటే ఉన్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం తారకరత్నతో పాటే ఉంటూ.. అతడి వైద్యం కోసం కావాల్సిన వాటిని అమర్చుతూ.. కన్న కొడుకులా కాపాడుకుంటున్నాడు.
ఇక తాజాగా బాలకృష్ణకు సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. సినిమాల విషయానికి వస్తే హిట్టు, ప్లాఫ్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు బాలకృష్ణ. ఏడాదికి రెండు మూడు సినిమాలు పట్టాలెక్కిస్తుంటాడు బాలయ్య. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అఖండ నుంచి వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న బాలకృష్ణ.. వీరసింహారెడ్డి సినిమా తర్వాత.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే తాజా అప్‌డేట్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అందుకు కారణం తారకరత్న ఆరోగ్య పరిస్థితి. సోదరుడి కుమారుడు తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి బాలయ్య దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. తారకరత్న వైద్యానికి కావాల్సినవి స్వయంగా సమకూర్చుతున్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా వాయిదా వేయమని బాలయ్య కోరారని తెలుస్తోంది. తారకరత్న అనారోగ్యం నేపథ్యంలో తన మానసిక పరిస్థితి ఏమి బాగాలేదని.. ఇలాంటి సమయంలో తాను షూటింగ్‌కి హాజరు కాలేనని బాలయ్య తెలిపాడట. తారకరత్న పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్‌కు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తారకరత్న పట్ల బాలయ్య చూపిస్తోన్న మద్దతు, ప్రేమ చూసి.. నిజమైన రక్త సంబంధం అంటే ఇది కదా.. సోదరుడి కొడుకు కోసం బాలయ్య ఎంత త్యాగం చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి తారకరత్న విషయంలో బాలయ్య చూపిస్తోన్న శ్రద్ధాసక్తులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.