నందమూరి నట సింగం బాలయ్య .. ఒకవైపు సినిమాలు, రాజకీయాలు మరోవైపు రియాలిటీ షోలతో తెగ సందడి చేస్తున్నారు. ఆరుపదుల వయస్సులో కూడా పుల్ జోష్ లో కనిపిస్తున్నారు. గతంలో సింహా,లెజెండ్ లాంట్ హిట్స్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
వరుస ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న బాలయ్య ఆహా వేదికగా.. అన్‌స్టాబబుల్ విత్ ఎన్‌బీకే పేరుతో పలువురు ప్రముఖులని తనదైన స్టైల్‌లో ఇంటర్వ్యూలు చేస్తూ.. పుల్ ఎంటర్ టైన్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్‌ను మంచు ఫ్యామిలీపై బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే తొలి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు కుటుంబసభ్యులపై తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ఇక రెండో ఎపిసోడ్లో న్యాచురల్ స్టార్ నాని రానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సెకండ్ ఎపిసోడ్ ఫుల్ వీడియో నవంబర్ 12న స్ట్రీమింగ్ కానుంది. కాగా, బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో వేదికపై చిందులు వేసిన వీడియోని ఆహా విడుదలచేసింది. అందులో హీరోయిన్ పూర్ణతో కలిసి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేశారు. నందమూరి నాయక.. పాటకు ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశాడు. బాలయ్య ఎనర్జీకి ఆయన ఫ్యాన్స్ తో పాటు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది ఈ వీడియో.