నందమూరి నటసింహం బాలకృష్ణకున్న మాస్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. బాలయ్య లాంటి భోళా మనిషి, నిగర్వి లాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉంటారు అంటారు ఆయన గురించి తెలిసిన వారు. బాలయ్యకు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆయనకు నచ్చని పని చేస్తే.. ఎక్కడ.. ఎంత మంది మధ్యలో ఉన్నా సరే.. ఆ విషయాలు పట్టించుకోకుండా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇక ప్రేమను పంచడంలో కూడా అదేవిధంగా ఉంటారు. ఫ్యాన్స్, చిన్న నటులు.. ఇలా అందరితో ఇట్టే కలిసిపోతారు బాలయ్య. ఇక అభిమానుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి సర్‌ప్రైజ్ ఇవ్వడం.. వారితో కలిసి భోజనం చేయడం.. సరదాగా చిట్ చాట్ చేయాలన్నా అది బాలయ్యకే సొంతం. ఇక తాజాగా సినిమా సెట్‌లో కమెడియన్ సప్తగిరికి, బాలయ్యకు మధ్య సరదా సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇదుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఈ సంఘటన ఎన్‌బీకే 107 మూవీ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాలయ్య, సప్తగిరి ఇద్దరూ ఒకేసారి డైలాగ్స్ చెప్పడం ప్రారంభించారు. ఇక సప్తగిరి డైలాగ్ చెబుతూ పోతూ ఉండగా.. బాలయ్య మధ్యలో ఆపేశారు. కానీ సప్తగిరి డైలాగ్ పూర్తిగా చెప్పి.. బాలయ్యను మెప్పించాడు. ఆ వెంటనే బాలయ్య ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన సప్తగిరి నవ్వుకుంటూ బాలయ్య కాళ్ల మీద పడ్డాడు. ‘ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా..’ అంటూ జోక్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022