మన దేశంలో సినీ స్టార్స్, క్రికెటర్స్ అంటే చాలామందికి ఎక్కడలేని అభిమానం. వాళ్లు బయట ఎక్కడ కనిపించినా సరే సెల్ఫీలని, ఆటోగ్రాఫ్స్ అని తెగ హడావుడి చేస్తారు. కొన్నిసార్లు అలాంటి స్టార్స్ కోసం పాదయాత్ర చేస్తుంటారు. గుళ్లో పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఇలా అభిమానం కొంతవరకు అయితే ఏం కాదు. అది కొన్నిసార్లు శ్రుతిమిస్తూ ఉంటుంది. దీంతో అనుకోని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. ఇప్పుడు అలాంటి ఓ సంఘటన మరోసారి జరిగింది. సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాస్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన తన నియోజకవర్గంలో పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనని పరిశీలించేందుకు వెళ్లగా, అవతలి వైపు ఉన్న ఓ డై హార్డ్ ఫ్యాన్.. వేగంగా పారుతున్న వాగులోకి దూకేసి బాలయ్యని కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు వాగులో కొంతదూరం కొట్టుకుపోయాడు. ఈ మొత్తాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అదికాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి అన్నగారు, రెడ్డిగారు తదితర టైటిల్స్ పరిశీలిస్తున్నారు. దీపావళి కానుకగా అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా కూడా.. ఈ దీపావళికే అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదంతా పక్కనబెడితే ‘అన్ స్టాపబుల్ 2’ మరోసారి మోత మోగిస్తున్నారు. తొలి ఎపిసోడ్ కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా వచ్చారు. ఇక రెండో ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగొడ్డ రానున్నారు. ఆ ప్రోమో ఇప్పటికే వైరల్ గా మారింది. సరే ఇదంతా వదిలేయండి.. బాలయ్య కోసం అభిమాని వాగులో దూకడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
బాలయ్య ని కలవాలి అని నదిలో దూకేసాడు 🙄 ఇదేమి అభిమానం రా అయ్యా 🙏🏻
అందుకే అంటారు ఆయన్ని God Of Masses అని 🤙 #Nandamuribalakrishna#GodofMassesNBK #JaiBalayya pic.twitter.com/Uc9nu3E2Lg
— SWEETY CHITTINENI (@SweetyChittine1) October 18, 2022
ఇదీ చదవండి: నేషనల్ క్రష్‌పై మనసుపడ్డ బాలయ్య.. ఆమే నా క్రష్ అంటూ..!