బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే, కమెడియన్ బాబూ మోహన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా ఇంట్లో రెండు రోజులు ఉండు అంటూ మాట్లాడాడు.
సాధారణంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు పలు ఛానల్స్ కు రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఈ ఇంటర్వ్యూల్లో షాకింగ్ కామెంట్స్ చేస్తుంటారు. యాంకర్లపై, ఇతర వ్యక్తులపై కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత, కమెడియన్ బాబూ మోహన్. ఇక ఈసారి తనకు ఆందోల్ టికెట్ ఇస్తే.. కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది చెబుతున్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్ పై పైర్ కూడా అయ్యారు బాబూ మోహన్. ఏంటి నా ముందు తెడ్డు తిప్పుతున్నావ్ అంటూ కాస్త ఘాటుగానే మాట్లాడారు బాబూ మోహన్.నీకు పూర్తి వివరాలు కావాలంటే మా ఇంట్లో ఒక్క పూట కాదు రెండు రోజులు ఉండు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బాబూ మోహన్.. టాలీవుడ్ టాప్ కమెడియన్ గా 90ల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కోటా శ్రీనివాస్ తో కలిసి బాబూ మోహన్ పండించిన కామెడీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇక సినిమాల నుంచి దూరం అయ్యాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బాబూ మోహన్. భారాసా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు బాబూ మోహన్. ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు. తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ పై పలు షాకింగ్ కామెంట్స్ చేశారు బాబూ మోహన్. భారాసా పార్టీలో ఉన్నప్పుడు మా బావా మా బావా అంటూ కేసీఆర్ ని పొగిడి.. బీజేపీలో చేరాక తిడుతున్నారు ఎందుకు? అని యాంకర్ ప్రశ్నించగా.. నీకు ఎంత వరకు చెప్పాలో నాకు తెలుసు. ఏంటి నా ముందు తెడ్డు తిప్పుతున్నావ్ అంటూ సీరియస్ అయ్యారు బాబూ మోహన్.
దాంతో డిష్కషన్ అంటే ఇలాగే ఉంటుంది. మనం మాట్లాడుకుంటేనే కదా ప్రజలకు మరిన్ని విషయాలు తెలిసేవి అంటూ యాంకర్ అడిగింది. దాంతో బాబూ మోహన్ తన నోటికి పని చెప్పాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఫ్రీగా ఉన్నప్పుడు రా.. మా ఇంట్లో ఉండు. ఒక్క పూట కాదు రెండు రోజులు ఉండు అప్పుడు మాట్లాడుకుందాం అని షాకింగ్ కామెంట్స్ చేశాడు బాబూ మోహన్. ప్రజలకు ఎంత వరకు తెలియాలో అంతవరకే తెలియాలి అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఇంటర్వ్యూ ప్రారంభంలో యాంకర్ తో పులిహోర గట్టిగానే కలిపారు బాబూ మోహన్. నిన్ను చూసిన తర్వాత నాలో ఉత్సాహం పెరిగిందని, మీరు చెప్పే తీరు నచ్చుతుందని యాంకర్ కు బిస్కెట్లు వేశారు.
అయితే ఈ బిస్కెట్లపై కౌంటర్ ఇచ్చారు యాంకర్. యాంకర్లు గెస్ట్ లకు బిస్కెట్లు వేస్తారు. కానీ మీరు రివర్స్ లో నాకు బిస్కెట్లు వేస్తున్నారు అంటూ యాంకర్ కౌంటర్ ఇచ్చింది. దాంతో కంగు తిన్న బాబూ మోహన్ లేదు లేదు నా దగ్గరికి చాలా మంది యాంకర్లు ఇంటర్వ్యూలకు వస్తుంటారు. కానీ నేను వారితో ఇలా మాట్లాడను, చూడను. నీతోనే ఇలా మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు బాబూ మోహన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాబూ మోహన్ యాంకర్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.