Anshitha: తమిళ సీరియల్ నటులు, దంపతులు అర్నవ్-దివ్యల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దివ్య ఆరోపణలే నిజమని నిరూపించే పలు ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తాజాగా, ‘చెల్లమ్మ’ సీరియల్ ఫేమ్.. నటి అన్షిత ఫోన్ కాల్ ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో అన్షిత..దివ్యపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. చంపేస్తానంటూ బెదిరించింది. అర్నవ్కు ఐ లవ్ యూ చెప్పింది. ఆ ఆడియోలో.. ‘నువ్వు ఓ ఆడిపిల్లవయి ఉండి మరో ఆడిపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు’ అని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు అన్షిత ‘‘ నువ్వు ఇప్పుడు నా చేతికి చిక్కితే ఏం చేస్తానో తెలుసా?.. నిన్ను కొట్టి చంపి కుక్కకు వేస్తాను. అంత కోపం ఉంది నీ మీద నాకు. ఎందుకే నువ్వు ఇంకా ఈ భూమిపై ఉన్నావు. తెలివి లేదా?.
నేను అర్నవ్తో ఏం ఏం చేస్తానో నువ్వే చూడు’’ అనటమే కాకుండా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న అర్నవ్కు ఐ లవ్ యూ అని చెప్పింది. తర్వాత ముద్దులు కూడా ఇచ్చింది. ‘నువ్వు ముందు సక్కగా బతుకు’ అంటూ దివ్యపై మండిపడింది. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, నటి దివ్యకు అర్నవ్తో 2017లో పరిచయం అయింది. ‘కేలాడి కన్మణి’ సీరియల్ షూటింగ్ టైంలో ఇద్దరూ కలిశారు. దివ్యకు అప్పటికే విడాకులయ్యాయి. ఓ సంవత్సరం పాప కూడా ఉంది. ఆ విషయం తెలిసినప్పటికి అతడు ఆమెను ప్రేమించాడు.
దాదాపు ఐదు సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నారు. జూన్ 29న ఇద్దరికీ పెళ్లి అయింది. అతడికోసం ఆమె తన మతం కూడా మార్చుకుంది. పెళ్లి తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఇక, అప్పటినుంచి అర్నవ్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతడు వేరే నటితో ప్రేమలో ఉన్నాడని దివ్యకు తెలిసింది. భర్త ఆ నటితో షూటింగ్లో ఉన్నప్పుడు దివ్య అక్కడికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ ఒకే రూములో ఉండటం చూసి నిలదీసింది. దీంతో ఆ నటి దివ్యను కొట్టింది. దివ్య ముందే అర్నవ్ను ముద్దు కూడా పెట్టుకుంది. దీంతో దివ్య తన భర్త మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.