రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. యుద్ధానికి ముందు ఆ దేశం ఎంతో సుందరమైన ప్రదేశం. ఎన్నో చారిత్రక కట్టడాలు, సుందరమైన భవన నిర్మాణాలు, అందమైన ప్రకృతి ప్రదేశాలకు నిలయం. యుద్ధానికి ముందు వరకు కూడా ఆ దేశం నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండేది. అంతేకాక అక్కడ పలు తెలుగు సినిమాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి. 2017లో సాయి ధరమ్ తేజ్‌నటించిన విన్నర్ సినిమా షూటింగ్ ఉక్రెయిన్‌లోనే జరిగింది. అక్కడ షూటింగ్ కోసం వెళ్లిన మొదటి తెలుగు చిత్రం కూడా అదే. త్వరలో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కూడా ఉక్రెయిన్‌లో జరిగింది. సినిమాలోని నాటు నాటు సాంగ్‌ని అక్కడే షూట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ సీఎం జగన్ కు Jr.యన్టీఆర్ వీడియో కాల్ చేశారా?
ప్రస్తుతం సంక్షోభ కారణంగా ఉక్రెయిన్ పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ప్రజల జీవితం అస్తవ్యస్తమయ్యింది. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి మనసు చాటుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉక్రెయిన్ షూటింగ్ సమయంలో తనకు బాడీ గార్డ్‌గా వ్యవహరించిన వ్యక్తికి ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్ సందర్భంగా వెల్లడించారు రామ్ చరణ్.
ఇది కూడా చదవండి: RRR పాటలో హీరోలు పట్టిన జెండా అసలు కథ ఏంటంటే?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ సమయంలో అక్కడ ఓ వ్యక్తి నాకు సెక్యూరిటీ గార్డ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం సంక్షోభం కారణంగా అక్కడ పరిస్థితులు పూర్తిగా మారాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో మాట్లాడాను. ఆయన తండ్రి, 80 ఏళ్ళ వ్యక్తి గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు అని తెలిపాడు. సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీకి నేను కొంత ఆర్థిక సాయం చేశాను. అయితే నేను చేసిన ఆ సహాయం అతడికి సరిపోదు. కానీ నేను నా వంతు సహాయం చేశా” అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: వామ్మో.. సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్!
‘నాటు నాటు’ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని ప్యాలెస్‌లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ ప్రజలు చాలా ఫ్రెండ్లీ. ప్రొఫెషనల్. నాటు నాటు సాంగ్‌లో డ్యాన్స్ స్టైల్ వాళ్ళ డ్యాన్స్ స్టైల్ కాదు.. కానీ వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకున్నారు’’ అంటూ వారితో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, తాను, తమ టీమ్‌లో ఇతర సభ్యులు ఉక్రెయిన్‌లో తమకు తెలిసిన వాళ్ళతో మాట్లాడామని రాజమౌళి వివరించారు. రామ్ చరణ్ చేసిన మంచిపనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.