సెలబ్రిటీలపై హత్యాయత్నాలు జరగడం అనేది అభిమానులను కలవరపెడుతోంది. నాలుగు నెలల క్రితం ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్యకు గురై మరణించాడు. ఆ ఘటనను మరువకముందే మరో సింగర్ పై హత్యాయత్నం జరిగిన ఘటన ఇండస్ట్రీలో షాక్ కి గురిచేస్తోంది. తాజాగా పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్ పై హత్యాయత్నం జరిగిన వార్త సోషల్ మీడియాలో హాట్, సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్నీ ర్యాప్ సింగర్ హనీ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ద్వారా బయటికి రావడం జరిగింది.
అల్ఫాజ్ సింగ్ తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్ లో చేర్చారు. చాలా సీరియస్ కండిషన్ లో అల్ఫాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు సింగర్ అల్ఫాజ్ పై హత్యాయత్నానికి ప్రయత్నించి పారిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అల్ఫాజ్ ని హాస్పిటల్ లో చేర్పించారట. అయితే.. అల్ఫాజ్ పై దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో సోదరుడిపై హత్యాయత్నం జరిగిందంటూ సింగర్ హనీ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
అల్ఫాజ్ ఫోటో షేర్ చేస్తూ.. “శనివారం రాత్రి నా సోదరుడు అల్ఫాజ్ సింగ్ పై ఎవరో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎవరు ప్లాన్ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని నేను వదిలే ప్రసక్తి లేదు. దయచేసి నా సోదరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి” అంటూ హనీ సింగ్ పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే మరో పోస్ట్ లో అల్ఫాజ్ ప్రమాదం నుండి బయట పడ్డాడని చెబుతూ మొహాలీ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు హనీ సింగ్. ఈ క్రమంలో అల్ఫాజ్ ని రాయపూర్ కి చెందిన విక్కీ అనే వ్యక్తి గాయపరిచినట్లు తెలుస్తుంది. ఓ దాబాలో ఫ్రెండ్స్ ని కలిసిన అల్ఫాజ్.. బిల్ విషయమై విక్కీకి సహాయం చేయకపోవడంతో ఈ పనికి పాల్పడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక విక్కీపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
After #SiddhuMooseWala, #HoneySingh’s friend #AlfaazSingh aka #AmanjotSinghPanwar attacked in #Punjab
For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/d09ORQUqCf
— DNA (@dna) October 3, 2022
#Singer #AlfaazSingh suffers injuries after being attacked at #Mohali; #YoYoHoneySingh informs he is “out of danger”
Read More Here:🔗https://t.co/VyeSMhGMrm pic.twitter.com/aEyW2YMMBE
— NewsPoint (@NP_App) October 3, 2022