పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ గా కంటే పవన్ కళ్యాణ్ భక్తులమని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే పవన్ ని దేవుడు అని చెప్పుకుంటారు. అలాంటి పవన్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. పవన్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. గొప్ప గొప్ప చదువులు చదువుకుని.. గొప్ప స్థాయిలో నిలబడిన డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లలో కూడా పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలని ముందుగానే ప్రిపేర్ అయిపోతారు. దానికి తగ్గట్టే రిలీజ్ రోజున సెలవు పెట్టేసుకుంటారు. ఆఫీస్ ఉంటే బాస్ ని పర్మిషన్ అడుగుతారు. హెచ్ఆర్ మొఖాన ఒక లీవ్ లెటర్ పడేస్తారు. కుదరదు కాదు అంటే ఏం చేస్తారు. ఉద్యోగం అయితే మానరు కదా.
మరీ పవన్ మీద భక్తి ఎక్కువైతే మాత్రం మానేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఒకరు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. ఆరేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఆమె మరలా గుర్తు చేసుకుంది. అది 2017వ సంవత్సరం. సరిగ్గా అప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా విడుదల అయ్యింది. పవన్ కళ్యాణ్ కి ఇక్కడే కాదు.. యూఎస్ లో కూడా ఉన్నారని తెలిసిందే. ఆ సమయంలో అషు రెడ్డి.. డల్లాస్ లో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అప్పుడు డల్లాస్ లో కాటమరాయుడు ప్రీమియర్ షో చూసేందుకు.. సెలవు కావాలని మేనేజర్ కి మెయిల్ పెట్టింది. ఆ మెయిల్ వల్ల అషు రెడ్డి ఉద్యోగం పోయిందని వెల్లడించింది.
ఆ ఒక్క మెయిల్.. తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిందని.. కానీ ఏ రోజూ దాని గురించి పెద్దగా బాధపడలేదని.. ఇంకా పవన్ కళ్యాణ్ భక్తురాలినని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని మామూలుగా చెప్తే నమ్మరని.. అప్పటి మెయిల్ స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. ఇంతకే ఆ మెయిల్ లో ఏముందంటే.. ‘మంగళవారం నాడు నేను ఆఫీస్ కి రావచ్చు, రాకపోవచ్చు. రావాలని లేదు. ఎందుకంటే ఆరోజు పవర్ స్టార్ సినిమా విడుదల ఉంది. ప్రీమియర్ షో చూడకపోతే నాకది సిగ్గు చేటు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు అర్థం చేసుకోకపోతే నా ఉద్యోగం వేరొకరికి ఇచ్చినా పర్లేదు. కానీ మీరు నన్ను వదులుకోరని అనుకుంటున్నా, పని భారం ఎక్కువ కాబట్టి. కృతజ్ఞతలు అశ్విని రెడ్డి’ అంటూ రాసుకొచ్చింది.
మెయిల్ సబ్జెక్ట్ వచ్చేసి ‘మూవీ ఫీవర్’ అని పెట్టింది. అయితే ఆ మెయిల్ వల్ల తన ఉద్యోగం పోయినందుకు అషు రెడ్డి ఏ మాత్రం ఫీలవ్వలేదని తెలిపింది. కానీ మెయిల్ వల్ల తన జీవితం మలుపు తిరిగిందనేది వాస్తవం అని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అషు రెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అభిమానం ఉండచ్చు కానీ అభిమానం కోసం ఇలా ఉద్యోగం, జీవితం వదులుకోవడం మంచిది కాదని.. వెనక నమ్ముకుని ఉన్న వాళ్ళ కోసం కూడా ఆలోచించాలని కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ పై ఉన్న అభిమానంతో ఉద్యోగం వదులుకున్న అషు రెడ్డిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.