తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో రీల్స్, డబ్ స్మాష్ వీడియోస్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ.. తన గ్లామర్ షోతో జూనియర్ సమంతగా క్రేజ్ సంపాదించుకుంది. ఓ మోస్తరు ఫ్యాన్ బేస్ సెట్ అయ్యాక.. బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అషు రెడ్డి, ఇటీవల మరోసారి బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో పాల్గొని రచ్చచేసింది. అయితే.. అషు ఎక్కడున్నా గ్లామర్ ట్రీట్ మాత్రం గ్యారంటీ. గతంలో లావుగా ఉన్న అషు.. ఈ మధ్య నాజూకుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందులోనూ సన్నబడ్డాక అమ్మడు అందాల షోకు హద్దులన్నీ చెరిపేసిందని చెప్పవచ్చు.
ఎందుకంటే.. అషు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది. గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషు.. బుల్లితెర ప్రోగ్రాంతో పాటు వెబ్ సిరీస్ లు, సినిమాలలో కూడా అడపాదడపా మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో సెగలు రేపడంలో ఎల్లప్పుడూ ముందే ఉండే అషు.. తాజాగా పొట్టి బట్టలతో స్విమ్మింగ్ పూల్ లో హాట్ అందాలను విందు చేసింది. ఏకంగా బికినీ వేసి పూల్ లో తడిసిన అందాలతో సోషల్ మీడియా ఫాలోయర్స్ కి, నెటిజన్స్ కి మతులు పోగొడుతోంది అమ్మడు. ఇటీవల పూల్ లో పోజులు పెట్టడం చూసి షాకైన ఫ్యాన్స్.. ఈసారి ఏకంగా బికినీ వేసి అందాలను షో చేసేసరికి నోరెళ్లబెట్టి చూస్తున్నారు.
నిజానికి బోల్డ్ ఫోటోషూట్స్ అనగానే తన పేరే ముందుగా గుర్తొచ్చేలా చేస్తోంది అషు. మొన్నే తన బాడీపై పుట్టుమచ్చలు ఎన్ని కనిపిస్తున్నాయో లెక్కపెట్టి చెప్పండంటూ సవాల్ విసిరి.. ఇప్పుడు హాట్ అందాల షోతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలే మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు పరిచే అషు అందాలను చూసి అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం అషు రెడ్డి బికినీ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మొన్న చీరకట్టు.. నిన్న స్విమ్ సూట్.. ఇప్పుడు బికినీ.. ఇలా అషురెడ్డి బోల్డ్ ట్రీట్ ఎంతవరకు వెళ్తుందో చూడాలని అంటున్నారు ఫ్యాన్స్.