తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కామెడీ షో తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. అంతే కాదు బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇక జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు పొందిన కమెడియన్ అప్పారావు.. ఒక వైపు కామెడీ షోలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
అప్పారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేశాను. ఏడెనిమిదేళ్లు నాన్ స్టాప్ గా షూటింగులో పాల్గొంటూ వెళ్లాను. ఎక్కడా కూడా ఎలాంటి రిమార్క్ లేదు. జబర్దస్త్ కామెడీ షోతో నా జీవితమే మారిపోయింది. 2010 నుండి 2014 వరకూ 50 సినిమాలు చేస్తే.. 2014 తరువాత నుండి ఇప్పటికి వరకూ 150 సినిమాల్లో చేశా. దీన్నిబట్టి అర్దం చేసుకోవచ్చు.
జబర్దస్త్ ద్వారా వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ ఎంత అన్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నా ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం వద్దన్నారు. ఆ సమయంలో కరోనా ప్రభావం బాగా ఉండటంతో విరామం తీసుకోవడం బెటర్ అని నేను కూడా కాస్త దూరంగా ఉన్నాను. ఆ తర్వాత కూడా వాళ్లు నన్ను పిలవలేదు .. నా పేరు హోల్డ్ లో పెట్టారు.
ఇక బుల్లెట్ భాస్కర్ టీమ్ లో నేను కూడా ఒక టీమ్ లీడర్ అయినప్పటికీ.. స్కిట్స్ లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు చేయమన్నా చేశాను. కొన్ని స్కిట్స్ లో నా ఇమేజ్ తగ్గే పాత్రల్లో నటించాల్సి వచ్చింది.. ఆ సమయంలో నా మర్యాద తగ్గుతున్నట్టుగా నాకు అనిపించింది. అది అవమానంగా .. బాధగా అనిపించింది. ఈ కారణంతోనే ఆయన టీమ్ నుంచ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్’లో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు .. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది ” అని చెప్పుకొచ్చారు.