అనుష్క లుక్ చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. మా జేజమ్మేనా ఇలా ఉంది అని ఆశ్చర్యపోతున్నారు. ఆంటీలా ఉందేంటి అని అవాక్కవుతున్నారు. రెండేళ్ల తర్వాత బయటకొచ్చిన అనుష్క ఆంటీలా, బాగా బొద్దుగా కనబడుతుండడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
అనుష్క శెట్టి.. స్వీటీ శెట్టి అని కూడా పిలుస్తారు. స్వీట్ వ్యక్తిత్వం కలిగిన అనుష్క అసలు వివాదాల జోలికి వెళ్ళదు. తన పనేదో తాను చూసుకుని వెళ్ళిపోతుంది. సినిమా కోసం అవసరమైతే బరువు తగ్గడం, బరువు పెరగడం చేస్తుంది. సినిమాల పట్ల తనకున్న కమిట్మెంట్ అటువంటిది. అయితే అనుష్క రెండేళ్ల తర్వాత బయటకు వచ్చింది. మహాశివరాత్రి పర్వదినాన్ని ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో జరుపుకుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క శెట్టి ఏంటి ఇలా అయిపోయింది? మరీ బొద్దుగా ఉందేంటి? ఇక మాకు నమ్మకం పోయింది. పాత అనుష్క ఇక లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు అనుష్కకు ఏమైంది?
కెరీర్ తొలినాళ్లలో అనుష్క చాలా స్లిమ్ గా ఉన్న అనుష్క ఇప్పుడు చాలా బొద్దుగా కనబడుతోంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క.. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. దాదాపు చాలా సినిమాల్లో అనుష్క నాజూకుగానే కనిపించింది. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగింది. అయితే అదే ఇప్పుడు ఆమెకు సమస్యగా మారిందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి నుంచి అనుష్క బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తగ్గలేకపోతుందన్న వార్తలు వస్తున్నాయి. వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుందని.. అయినప్పటికీ మునుపటిలా ఆమె స్లిమ్ అవ్వలేకపోతుందని ప్రచారం జరుగుతోంది.
అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే పోస్టర్ లో ఉన్నంత నాజూకుగా బయట కనబడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా కోసం అనుష్క.. బరువు తగ్గిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆమె ఫోటోలను చూస్తే బరువు తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా అనుష్క తన కుటుంబ సభ్యులతో బెంగళూరులోని ఓ శివాలయానికి వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అనుష్క లుక్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అనుష్క ఆంటీలా మారిపోయిందని, ఇంత లావుగా ఉండాల్సిన అవసరం ఏముంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
#AnushkaShetty #Anushka‘s recent looks at a #Mahashivratri event in #Karnataka. pic.twitter.com/vMwrwXWMgy
— Crazy Buff (@CrazyBuffOffl) February 20, 2023
సైజ్ జీరో నుంచి బరువు తగ్గడానికి ఆమె స్ట్రగుల్ అవుతుందని, మునుపటి శరీరాకృతిని పొందడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుందని.. అనారోగ్య సమస్యలు తన బరువు తగ్గించుకోవడానికి అడ్డుగా ఉన్నాయని ఆమె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు గానీ ప్రస్తుతం అనుష్క లుక్ మాత్రం వైరల్ అవుతోంది. ఆమె ఆంటీలా ఉందని ఆశ్చర్యపోతున్నారు. కానీ నవీన్ పోలిశెట్టితో నటిస్తున్న సినిమాకు సంబంధించిన పోస్టర్ లో స్లిమ్ గా కనిపించిన అనుష్క.. ఇంత తక్కువ రోజుల్లో బొద్దుగా మారిపోతుందా? బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా ఆరోగ్యం సహకరించడం లేదేమో అన్న వార్తలు బలపడుతున్నాయి. మరి అనుష్క లుక్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
#AnushkaShetty celebrating Maha Shivaratri with her family in Bangalore🙏🤍.@MsAnushkaShetty ,@guna_trueblue ,@Poori5678pic.twitter.com/U1uHO8eTUp
— Anushka Shetty ❤ (@Sweetyfans_ARMY) February 19, 2023