బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన కొందరు హీరో హీరోయిన్లు కొన్నేళ్లు డేటింగ్ లు అంటూ తిరుగుతున్నారు. ఇక కొన్ని రోజులు గడిచాక విడిపోతున్నామని బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో ఇప్పటికీ ఎంతో మంది నటీనటులు వారి ప్రేమకు స్వస్తి చెప్పి ఎవరి దారుల్లో వారు నడుచుకుంటున్నారు.
ఇటీవల కాలంలో సమంత, నాగచైతన్య జంట విడిపోయిన విషయం తెలిసిందే. ఈ వార్త మరువకముందే మరో స్టార్ హీరోయిన్ ప్రేమకు గుడ్ బై చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అసలు ఇంతకు బ్రేకప్ చెప్పిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరనే కదా మీ ప్రశ్న. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించి వరుస సినిమాలతో బిజీగా మారింది అందాల బామ శ్రద్దా కపూర్.
గత కొన్నేళ్లుగా సైలెంట్ గా సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఘాడమైన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. వీరి ప్రేమ గురించి అప్పట్లో తీవ్ర చర్చనే నడిచింది. అయితే పీకల్లోతూ ప్రేమలో మునిగిన ఈ జంట ఉన్నట్టుండి బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
ఇటీవల జరిగిన శ్రద్దా కపూర్ బర్త్ డే కి రోహన్ హాజరు కాలేదట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి చేరాయని, దీని కారణంగానే వీరిద్దరూ విడిపోయారనే న్యూస్ ప్రచారంలో ఉంది. మరి నిజంగానే శ్రద్దా కపూర్ తన ప్రియుడితో విడిపోయిందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. శ్రద్దా కపూర్ లవ్ బ్రేకప్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.