యాంకర్ సుమ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో యాంకరింగ్ అనే కెరీర్‌కు గుర్తింపు ఆమె వల్లనే వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి షో అయినా సరే.. ఆమె మాటల ప్రవాహంతో దాన్ని ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకెళ్తుంది. ఆమె సమయస్ఫూర్తికి, చలాకీతనానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఇటు బుల్లి తెర మీద అగ్ర యాంకర్‌గా రాణిస్తూనే.. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది. తెలుగులో ఎంత భారీ బడ్జెట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సరే.. అక్కడ యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. ఇలా షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరోవైపు బిగ్ స్క్రీన్ మీద జయమ్మ పంచాయతీ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీల్ మీద ఇంత యాక్టీవ్‌గా కనిపించే సుమ.. వ్యక్తిగత జీవితంలో ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
తను యూట్యూబ్ ఛానల్‌లో ఆ వ్యాధి గురించి మాట్లాడుతూ.. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నట్లు తెలిపింది సుమ. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో భాదలు, కష్టాలు పడినట్లు చెప్పారు. ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బందులు పడాల్సి వస్తుందని బాధపడ్డారు. తన కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటి విషయాలు సరిగ్గా తెలియక తన చర్మానికి ఈ డ్యామేజ్ జరిగిపోయిందని, తర్వాత అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా.. ఫలితం రాలేదని వెల్లడించింది. కీలాయిడ్ టెండెన్సీ అంటే అంటే తనకు ఏదైనా గాయం అయితే.. అది అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా హీల్ అవుతుంది. దాని వల్ల తన ఒంటిపై గాయం మానినా.. దాని ఆనవాళ్లు బాగా కనిపిస్తుంటాయి అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Love: వీడియో: క్యాష్ షోలో సాయిపల్లవి! స్టేజ్ పైనే లవ్ ప్రపోజ్ చేశాడు!
ఇక అది అలా ఉంటే సుమ ఒక్క షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ మూవీ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్‌లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. మరి సుమకున్న ఈ అరుదైన వ్యాధి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ ని గుర్తుకు తెస్తున్న యాంకర్ సుమ కొడుకు రోషన్!