తెలుగు టీవీ ప్రేక్షకులకు దగ్గరైన జబర్దస్త్ ఫేమ్ కమెడియన్లలో వినోద్(వినోదిని) ఒకరు. వినోద్ తనదైన శైలిలో లేడీ గెటప్ తో జబర్దస్త్ లో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. అయితే.. అందరికీ వినోద్ ఓ జబర్దస్త్ కమెడియన్ గా మాత్రమే తెలుసు. కానీ వినోద్ లైఫ్ స్టోరీ వింటే మాత్రం ఖచ్చితంగా కన్నీళ్లు ఆగవు. ఎవరూ లేని వినోద్ భార్యకి యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాంలో సీమంతం జరిపించి మంచి మనసు చాటుకుంది.
ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. చివరివరకు సరదాగా సాగిన ప్రోమోలో వినోద్ భార్య విజయకు సీమంతం జరిపించడం అనేది విశేషంగా నిలుస్తుంది. ఎక్కువగా చమ్మక్ చంద్ర టీమ్ లో కనిపించే వినోద్.. తన మార్క్ పంచ్ లతో ఆకట్టుకుంటున్నారు. `జబర్దస్త్` షో ద్వారానే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.వినోద్ తో పాటు జబర్దస్త్ కమెడీయన్లు పవన్, తన్మయి, హరికృష్ణ కూడా షోలో పాల్గొన్నారు. హరికృష్ణ కూడా తన భార్యతో పాల్గొనగా, పవన్, ట్రాన్స్ జెండర్ తన్మయి తమ మదర్స్ తో సందడి చేశారు. ప్రస్తుతం వినోద్ భార్య విజయ ప్రెగ్నెన్సీతో ఉంది. దీంతో `క్యాష్` షోలోనే ఇతర జబర్దస్త్ కమెడీయన్లు, ఆడియెన్స్ మధ్య వినోద్ భార్య సీమంతం నిర్వహించింది సుమ. అయితే విజయ సీమంతం చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని తెలుస్తుంది.
భార్య సీమంతం చూసిన వినోద్ ఎమోషనల్ అయిపోయి.. ఇటీవలే తన తండ్రి చనిపోయినట్టు చెప్పాడు. దీంతో తాను ఒంటరైపోయానని.. విజయకి కూడా అమ్మానాన్న లేరని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక చలించిన సుమ.. ‘మీకు అమ్మ లేదు కదా.. అమ్మ ఉంటే ఇలానే చేసేది కదా.. నీకు నేనే అమ్మని, సీమంతం చేస్తా` అంటూ చేసి అందరిని చేసింది. మరి వినోద్ వైఫ్ విజయ సీమంతం పై అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.