బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి.. చిత్రపరిశ్రమలో క్రేజ్ సంపాదించుకున్నవారు చాలామంది ఉన్నారు. వారంతా సినిమాలు చేస్తూ బిజీ అవుతారని చెప్పలేం. కానీ.. వారికున్న స్కిల్స్ లో ఏదోకటి బయటపెట్టి సక్సెస్ అవుతుంటారు. అలా బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమాల్లోను తన అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్ యాంకర్ శ్రీముఖి. అవును.. బుల్లితెరపై యాంకర్ గా ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మధ్యకాలంలో తన గ్లామర్ షోతో అందరి మతులు పోగొడుతోంది. తాజాగా శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
శ్రీముఖి గురించి అటు బుల్లితెర ఫ్యాన్స్ కి, ఇటు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పటాస్ షో మొదలుకొని ఎన్నో సూపర్ హిట్ షోలను హోస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతినిండా టీవీ షోలతో పాటు ఓవైపు అడపాదడపా సినిమాలలో మెరుస్తోంది. ఆన్ స్క్రీన్ పై ఎన్ని చేసినా.. ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే.. శ్రీముఖి గ్లామర్ ట్రీట్ పెంచేసిందని చెప్పాలి. కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతున్నప్పటికీ, ఆ మధ్య లైఫ్ లో లవ్ బ్రేకప్ బాగా బాధించిందని, దాని నుండి బయట పడటానికే చాలా టైమ్ పట్టిందని చెప్పింది. అయితే.. శ్రీముఖి లవ్ బ్రేకప్ చేసుకుంది ఎవరితో అనేది మాత్రం ఎప్పుడూ లీక్ చేయలేదు.
ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ తన లైఫ్ ని తనకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో పాటు రీసెంట్ గా గోవా టూర్ వెళ్లి.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేసింది. బీచ్ ఇసుకలో టాప్ టు బాటమ్ అందాలన్నీ ఆరబోస్తూ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే.. హీరోయిన్ గా ఛాన్సులు వస్తే వద్దనుకున్న శ్రీముఖి.. ఈ మధ్య హీరోయిన్స్ ని మించిన అందాల షో చేస్తుండటం విశేషం. పైగా షోలలో కూడా హాట్ డాన్స్ లతో రెచ్చిపోతోంది. కాగా.. తాజాగా శ్రీముఖి జిగేల్ మనే చేపల పొలుసుల మాదిరి డిజైనింగ్ డ్రెస్ ని వేసుకొని లిఫ్ట్ లో ఫోటోషూట్ చేసింది. ఇంకేముంది.. టాప్ సంగతి పక్కన పెడితే.. థైస్ షో మాత్రం బాగా చేసింది. మరి ఇప్పుడైతే శ్రీముఖి అందాల రచ్చ వైరల్ గా మారింది. మరి శ్రీముఖి అందాల రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.