ఆమె స్వతహాగా యాంకర్.. మొన్నమొన్నటి వరకు మోడ్రన్ డ్రస్సులు, లంగా ఓణీలు వేసుకుని బాగానే కనిపించింది. ఏమైందో ఏమోగానీ సడన్ గా రూట్ మార్చేసింది. గ్లామర్ తో హీట్ పెంచేస్తూ సోషల్ మీడియాని షేక్ ఆడిస్తోంది. గత కొన్నాళ్ల నుంచి ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు.. కుర్రాళ్లని కుదురుగా కూర్చోనివ్వకుండా చేసే శ్రీముఖి ఫొటోలే దర్శనమిస్తున్నాయి. మీలో కూడా చాలామంది వాటిని చూసి ఒక్క క్షణం మైమరిచిపోయింటారు. కాకపోతే మీరు దానికి ఒప్పుకోరు అంతే!
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకోవడమంటే మాటలు కాదు. చలాకీతనంతోపాటు ప్రేక్షకుల్ని హోల్డ్ చేసే స్పాంటేనిటి ఉండాలి. సుమ, ప్రదీప్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న పర్సన్ యాంకర్ శ్రీముఖి. సింగింగ్, కామెడీ, డ్యాన్స్.. ఇలా ప్రోగ్రామ్ తో సంబంధం లేకుండా అందులో ఉంటోంది. ఉన్నా అంటే ఉన్నా అన్నట్లు కాకుండా తన మార్క్ క్రియేట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో పొట్టిపొట్టి దుస్తుల్లో కనిపించి, యూత్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
బిగ్ బాస్ 3వ సీజన్ లో పాల్గొన్న శ్రీముఖి.. ఫైనల్లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది. ఇక గతంలో చిన్న చిన్న రోల్స్ చేసిన శ్రీముఖి.. ‘క్రేజీ అంకుల్స్’ అనే అడల్ట్ చిత్రంలోనూ నటించింది. కొన్నాళ్లు ముందు బొద్దుగా కనిపించిన శ్రీముఖి.. ఈ మధ్య మళ్లీ సన్నగా మారిపోయింది. ఇక లేట్ ఎందుకంటూ.. మెరిసే దుస్తుల్లో మైమరపిస్తోంది. ఇక తాజాగా సిల్వర్ కలర్ గౌనులో దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అందాలన్నీ చూపిస్తూ విజువల్ ట్రీట్ ఇస్తోంది. ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ షో కోసమే శ్రీముఖి ఇంత అందంగా రెడీ అయింది. మరి శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖిని ముద్దుల్తో ముంచెత్తిన రణ్వీర్ సింగ్