వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ అనేది అందరికీ తెలిసిందే. వర్మ బోల్డ్ నెస్ వలన ఎంతోమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకొని.. ఏకంగా బిగ్ బాస్, సినిమాల వరకూ వెళ్లారు. ఎందుకంటే.. వర్మ ద్వారా ఫేమ్ పొందాలంటే వాళ్ళు కూడా అంతే బోల్డ్ నెస్ ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పటివరకు వర్మ పరిచయం లేదా ఇంటర్వ్యూస్ ద్వారా పాపులర్ అయినవారిలో బిగ్ బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియానా గ్లోరిలతో పాటు ఇనాయ సుల్తానా కూడా ఒకరు. అంటే.. వర్మ పరిచయం ద్వారా వచ్చిన క్రేజ్ తోనే వీరు ముగ్గురు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా అవకాశాలు అందుకున్నారని చెప్పవచ్చు.
ఈ క్రమంలో వర్మ స్కూల్ లో మరో కొత్తమ్మాయి చేరినట్లుగా తెలుస్తోంది. అదికూడా వర్మని మించిన బోల్డ్ నెస్ తో.. డైరెక్ట్ ఫేస్ మీదే సెక్సువల్ టాపిక్ ప్రశ్నలు సంధిస్తూ షాకిచ్చింది. యాంకర్ సాయిప్రియ.. పెద్దగా జనాలకు తెలియకపోవచ్చు. కానీ, తాజాగా వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ చూస్తే.. సాయిదివ్య ఎంత బోల్డ్ అనేది ఇట్టే అర్థమవుతుంది. వర్మ నోటినుండే ఈ అమ్మాయి నాకంటే బోల్డ్ గా, వైల్డ్ గా ఉందని అనిపించుకుంది అంటే ఆలోచించండి. రీసెంట్ గా వర్మ తీసిన లెస్బియన్ మూవీ.. డేంజరస్. ‘మా ఇష్టం’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్మతో సాయిదివ్య ఇంటర్వ్యూ చేసింది.
ఇక వర్మతో చేసిన ఇంటర్వ్యూలో ఇంతవరకు ఎవ్వరూ అడగని, అడుగుదామని ఆగిపోయిన ప్రశ్నలన్నీ కెమెరా ముందు పెట్టేసింది. వర్మకి ఎలాగో అమ్మాయి అందాన్ని చూస్తూ ఆన్సర్ చేయడం ఇష్టం కాబట్టి.. వర్మకి అనుకూలంగా థైస్ చూపిస్తూ, మినీ స్కర్టులో దర్శనమిచ్చింది యాంకర్ సాయిదివ్య. సెక్సువల్ గా ఎన్నో ప్రశ్నలు అడిగిన సాయిదివ్య.. అరియానా, అషురెడ్డి, ఇనాయ సుల్తానాలతో ఎప్పుడైనా సె*క్స్ చేశారా? అని సూటిగా అడిగేసింది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న వర్మ.. తానెప్పుడూ వారితో సె*క్స్ చేయాలేదని, నేను చేయాల్సిందంతా కెమెరా ముందే చేస్తానని చెప్పాడు. అలాగే వారు కేవలం ఇంటర్వ్యూస్ వరకే వస్తారని, వెనుకాముందు ఇంకేమి లేవని క్లారిటీ ఇచ్చేశాడు వర్మ. మొత్తానికి బోల్డ్ యాంకర్ ద్వారా కొన్ని నిజాలు బయటపడ్డాయని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. కాగా, బిగ్ బాస్ లో నెక్స్ట్ సీజన్ కి వర్మ స్కూల్ నుండి సాయిదివ్య వెళ్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.