చాలా మంది అమ్మాయిలు చిన్న బొద్దింకను చూస్తేనే భయంతో అంత దూరం పరిగెడతారు. ఇక బల్లి, పాము వంటి పేరు వింటే… దరిదాపుల్లో కూడా ఉండరు. ఇక కుక్కను చూసి కూడా ఎంత భయపడతారో ప్రత్యేకంగా చెప్క్కర్లేదు. ఇవంటే నార్మల్‌గా మన చుట్టూ ఉండే జీవులు.. ఇక వీటిని చూస్తేనే ఇంతలా భయపడితే.. ఇక క్రూరమృగాలైన పులి, సింహం, ఎలుగుబంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాలా. వాటిని జూలో దూరంగా నిల్చూని చూడటమే కానీ.. దగ్గరకు వెళ్లే సాహసం ఎవరు చేయలేరు. కానీ ఓ టాలీవుడ్ కుర్ర హారోయిన్ మాత్రం.. ఏకంగా పులితో ఆడుకుంటూ.. దాని తల నిమురుతూ.. ఎంతో సంతోషంగా ఫోటోలు దిగి.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి చూసిన వారంతా.. వామ్మో.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఎవరా హీరోయిన్.. ఎక్కడ ఇలా పులితో ఫోటో దిగిందో తెలియాలంటే.. ఇది చదవండి.
‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనన్య నాగళ్ల. ఆ తర్వాత ఆమె ‘వకీల్ సాబ్’, ‘ప్లే బ్యాక్’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం పలు సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. ఇక అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని అనన్య ఇప్పుడు మంచి ‘బ్రేక్’ కోసం ఎదురుచూస్తోంది. ఒక్కసారి హీరోయిన్‌గా క్లిక్కైతే.. తిరిగే ఉండదని భావిస్తోంది. అయితే, అవకాశాలు రాలేదని డీలా పడకుండా లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తోంది ఈ వకీల్ సాబ్ బ్యూటీ.
ఇది కూడా చదవండి: Kamal Haasan: విక్రమ్ మూవీ ఘన విజయం.. అప్పులన్ని తీరుస్తాను.. నచ్చినవి తింటాను!
అనన్యకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఇటీవలే ఆమె ఉత్తరాఖండ్‌లోని మస్సూరికి వెళ్లొచ్చింది. ఆ తర్వాత ఆమె థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఆ వీడియోలు ఫొటోలను తన అభిమానులతో కూడా పంచుకుంటోంది. తాజాగా ఆమె పులితో ఆటలాడుతూ కనిపించింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పులి దగ్గర కూర్చొని, దాన్ని టచ్ చేస్తున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రం ఏమిటంటే.. ఆమె టచ్ చేసినా సరే ఆ పులి అనన్యను ఏమి అనడం లేదు.
ఇది కూడా చదవండి: Adivi Sesh: అడవి శేష్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న… ‘మహేష్ బాబును పొగడలేదు.. నీకు అంత పొగరా?’
‘‘ఈ పులులకు ఎలాంటి మత్తు ఇవ్వలేదు. పుట్టినప్పటి నుంచే వీటిని మనుషులే పెంచుతారు. కాబట్టి, అవి మనుషుల మధ్యే తిరుగుతాయి’’ అని అనన్య క్యాప్షన్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nayanthara: పెళ్లికి రాని నయనతార తల్లి! పెళ్ళైన 5 రోజులకే పుట్టింటికి నయనతార!