నందమూరి నటసింహం.. బాలకృష్ణకున్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాంతం ఏదైనా సరే.. బాలయ్య పేరు వినపడితే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే. రచ్చ రచ్చ చేస్తారు. హంగామా మాములగా ఉండదు. అలాంటిది సినిమా విడుదల సమయంలో బాలయ్య అభిమానుల చేసే రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కటౌట్లు, ఈలలు, డీజే మోత, పూల దండలు, పేపర్ కటింగ్‌లు అబ్బో ఓ రేంజ్లో ఉంటుంది. మన దగ్గర బాలకృష్ణ స్టార్ హీరో కాబట్టి.. ఆయన ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ఇక్కడి థియేటర్ యజమానులకు తెలుసు.. కనుక అభిమానులు ఎంత గోల చేసిన పట్టించుకోరు. మన దగ్గర ఏం చేసిన చల్తా కనుక.. వేరే ప్రాంతాల్లో కూడా అలానే చేస్తామంటే.. ఇదిగో తరువాత ఇలాంటి పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. సినిమాను మధ్యలోనే ఆపేసి.. మరీ బయటకు పంపిస్తారు.
బాలయ్య బాబు సినిమా ఆపేస్తారా.. మీకెంత ధైర్యం అని ప్రశ్నించడానికి.. అది మన ప్రాంతం కాదు.. మన దేశం కాదు. విదేశాల్లో ఇలా రచ్చ రచ్చ చేస్తే.. వాళ్లు.. అందుకు తగ్గట్లు చర్యలు తీసుకుంటారు. సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యింది. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సినిమా అంటే.. అభిమానులకు పూనకాలే. ఇక తెర మీద బాలయ్య చెప్పే మాస్ డైలాగ్స్, ఫైట్స్ చూస్తూ.. థియేటర్లో అభిమానులు రెచ్చి పోతారు. కాగితాలు విసురుతూ.. అరుస్తూ గోల గోల చేస్తారు.
ఇక అమెరికాలో కూడా బాలయ్య సినిమా చూస్తూ.. ఇంతే రచ్చ చేశారు ప్రేక్షకులు. దాంతో థియేటర్ యజమానులు.. సినిమా ఆపేసి మరీ.. ప్రేక్షకులను బయటకు పంపించారు. అంతేకాక.. తమ థియేటర్లో ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమా ప్రదర్శించామని.. కానీ ఎప్పుడు ఇలా జరగలేదని.. ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇది చేస్తే.. ఫ్యాన్స్ ఏ రేంజ్లో రచ్చ చేశారో అర్థం అవుతుంది. ఇక మరో థియేటర్లో జై బాలయ్య అంటూ అరవకూడదని సూచించారు. మన దగ్గర థియేటర్ యజమానులు ఇలాంటి సాహసం చేయగలరా.. మీరేమనుకుంటున్నారు.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#VeeraSimhaReddyOnJan12th Cancelled Shows In America pic.twitter.com/UstIN8qhRx
— Sekhar Rambo (@RamboSekhar) January 12, 2023