ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మొన్నటివరకు ఈ పేరు తెలుగు వరకు మాత్రమే తెలుసు. ‘పుష్ప’ రిలీజ్ తర్వాత బన్నీ పేరు మార్మోగిపోయింది. అలా కోట్లాదిమంది తెలుగువాళ్లే కాకుండా ఇతర భాషల సినీ స్టార్స్ కూడా అల్లు అర్జున్ కి అభిమానులు అయిపోయారు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా సరే స్టైల్ విషయంలో బన్నీ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. ప్రతి సినిమాలో చేసే పాత్ర పరంగానే కాదు.. వేసుకునే డ్రస్సుల్లోనూ వైవిధ్యం చూపిస్తుంటాడు. ఇక అల్లు అర్జున్ భార్య కూడా భర్తకి తగ్గట్లే స్టైల్ మెంటైన్ చేస్తోంది. ‘బన్నీ భార్య అంటే బన్నీలో సగం కాదు బన్నీకి డబుల్’ అనే రేంజులో ఆకట్టుకుంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిట్ నెస్ విషయంలో బన్నీ ఎలా పక్కాగా ఉంటాడో, స్నేహ కూడా అంతే ఫెర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లయినా సరే.. ప్రస్తుతం తెలుగులో చేస్తున్న పలువురు హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉంటుంది. కఠినమైన యోగాసనాలు వేస్తున్న స్నేహ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ కావడం మనం చూశాం. ఇప్పుడు తాజాగా ఆమె తన 37వ పుట్టినరోజుని కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. భార్యకు పుట్టినరోజు విషెస్ చెప్పిన బన్నీ.. పర్సనల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. దాన్ని స్నేహ.. తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.
ఇక కొన్నాళ్ల పాటు ప్రేమించిన తర్వాత ఇంట్లో వాళ్లను ఒప్పించి అల్లు అర్జున్-స్నేహ పెళ్లిచేసుకున్నారు. వీళ్లకు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బన్నీతోపాటు భార్య స్నేహ, పిల్లలిద్దరూ కూడా సోషల్ మీడియా వీడియోస్, ఫొటోల్లో తరచుగా కనిపిస్తూ నెటిజన్స్ ని అలరిస్తుంటారు. ఇదిలా ఉండగా గతేడాది ‘పుష్ప’ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్.. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈనెల లేదంటే వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. వచ్చే ఏడాది చివర్లో ‘పుష్ప 2’ థియేటర్లలోకి రావొచ్చు. ఇదంతా పక్కనబెడితే స్నేహ బర్త్ డే వేడుకలు ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
.@alluarjun Birthday Wishes to his Queen #AlluSnehaReddy 🤍🤩
Adorable Family and Smiles #pushpa #PushpaTheRule pic.twitter.com/zCZ19sfXvv
— Sumanth (@SumanthOffl) September 29, 2022