Allu Aravind: సౌత్ సినిమా ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్స్‌లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్నో అద్బుతమైన సినిమాలను ఆయన ప్రేక్షకులకు అందించారు. మగధీర సినిమాతో తెలుగు తెరపై ఓ సంచలనాన్ని ఆవిష్కరించారు. నిర్మాతగానే కాదు.. నటుడిగానూ అల్లు అరవింద్ మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన మూడు సినిమాల్లో అరవింద్ నటించారు. కానీ, ఆ తర్వాత నిర్మాణ రంగానికే పరిమితం అయ్యారు. దాదాపు 40 ఏళ్లుగా బడా నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 50కిపైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా, ఆయన స్టార్ కమెడియన్ అలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రి అల్లు రామలింగయ్యకు సంబంధించిన విషయాలతో పాటు తన గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే అలీ అడిగిన ఓ ప్రశ్నకు అల్లు అరవింద్ కొద్దిగా సీరియస్ అయ్యారు. అలీ ‘‘ అరవింద్ గారి ఫ్యామిలీకి.. చిరంజీవి గారి ఫ్యామిలీకి చిన్న డస్ట్రబెన్స్ వచ్చింది’’ అని అడిగారు. అందుకు అరవింద్ బదులిస్తూ.. ‘‘మీరు… కొన్ని కాంట్రవర్సియల్ అడుగుతాను అని అంటే అవి ముందు చెప్పండి అని అన్నాను. ‘అబ్బే అదేమీ లేదండి. సర్ప్రైజింగ్ క్వశ్చన్లు ఉన్నాయి’ అన్నారు. సర్ప్రైజింగ్ క్వశ్చన్స్‌లో ఇదొకటా?..’’ అని తిరిగి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, అలీ అడిగిన ప్రశ్నకు అల్లు అరవింద్ ఏం సమాధానం ఇచ్చారో తెలియాలంటే అక్టోబర్ 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి: GodFather: మాసివ్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతున్న గాడ్ ఫాదర్! ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్?