‘సోగ్గాడే చిన్నినాయన’ నాగార్జున కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. వాసివాడి తస్సాదియ్యా అంటూ పంచ కట్టుకుని, బుల్లెట్‌పై వచ్చిన బంగార్రాజుకు అందరూ ఫిదా అయిపోయారు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించారు. అందుకే నాగార్జున బంగార్రాజు టైటిల్‌తో మరో సినిమా తీయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. మధ్యలో ఆ సినిమా తీయట్లేదని, ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. సినిమా కచ్చితంగా వస్తుందని వైల్డ్‌డాగ్ ప్రమోషన్స్‌లో నాగ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
విషయానికొస్తే బంగార్రాజు టైటిల్‌తో సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్‌ను తీయబోతున్నారు. ఈ సినిమాకు మూర్తతం ఖరారైంది. ఆగస్టు 20న హైదరాబాద్‌లో బంగార్రాజు సినిమా పూజా కార్యక్రమం జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని స్టూడియోలలో సెట్స్ వర్క్ జరుగుతోంది. ఇక, నాగచైతన్య ఈ సినిమాలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే, నాగచైతన్యకు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించనుంది.
ఉప్పెన భారీ విజయం సాధించడానికి ముందే కృతీశెట్టితో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.. బంగార్రాజు సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఉప్పెన రిలీజ్ అవడానికి ముందే తనతో మాట్లాడామని, కరోనా వల్ల ఆలస్యం జరిగిందన్నారు. కృతీశెట్టి హావభావాలు చాలా నాచురల్‌గా ఉంటాయంటున్నారు. బంగార్రాజులో కృతీశెట్టి క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉండబోతోందంట. ఇంకా, కృతీశెట్టి అఫీషియల్‌గా సినిమా సైన్ చెయ్యాల్సి ఉంది.