నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. సాయి పల్లవి డాన్స్, నాగచైతన్య యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంక ఎప్పటిలాగానే శేఖర్ కమ్ముల మ్యాజిక్‌తో సినిమాని ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 24న విడుదలైన ఏఎన్నార్ ‘ప్రేమ్‌నగర్’ రికార్డులు తిరగరాసింది. మళ్లీ అదే రోజు రిలీజైన చై లవ్‌స్టోరీ కూడా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమానికి అమీర్ ఖాన్ హాజరయ్యారు. బిజీ షెడ్యూల్ వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన నాగార్జున.. తర్వాత లవ్‌స్టోరీ టీమ్ మొత్తానికి ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ప్రత్యేక అతిథిగా అమీర్ ఖాన్‌ను ఆహ్వానించారు.
నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ములతోపాటు అఖిల్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడు. అందరూ కలిసి కేక్ కట్ చేసి వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అమీర్‌ఖాన్‌తో నాగార్జున ప్రత్యేకంగా ముచ్చటించాడు. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసందే. ప్రస్తుతం నాగచైతన్య అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో నటిస్తున్నాడు. అందులో బాలరాజు అనే తెలుగు ఆర్మీ ఆఫీసర్‌గా ‘చై’ కనిపించబోతున్నాడు. గతంలో ఏఎన్నార్ కూడా బాలరాజు పేరుతో ఓ చిత్రం తీసి మంచి హిట్ కొట్టారని.. నాగచైతన్య కూడా బాలీవుడ్‌లో బాగా రాణిస్తాడని నాగార్జున అమీర్‌ఖాన్‌తో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పార్టీలో ‘సమంత’ కనిపించంక పోవడం అభిమానులు, సినీ వర్గాల్లో మరోసారి చర్చగా మారింది.