అక్కినేని అఖిల్.. పక్కా స్టార్ హీరో మెటీరియల్. ఒక్క హిట్ కొడితే.. ఒక రేంజ్ కి వెళ్లిపోయే సత్తా ఉన్న హీరో. కానీ.., ఈ అక్కినేని అందగాడిని మాత్రం అదృష్టం వరించడం లేదు. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా.., తన మీద ఉన్న అంచనాలకి తగ్గ విజయాన్ని అందుకోలేకపోయాడు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తూ.., బిజీగా ఉన్నాడు. అయితే.., ఈ మూవీ రిలీజ్ కాకముందే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాకి కమిట్ అయిపోయాడు అఖిల్. ఇప్పుడు ఆ సినిమా కోసమే అఖిల్ తీవ్రంగా కష్టపడుతున్నాడు.
ఏజెంట్ లో అఖిల్ లుక్ ఇప్పటికే అభిమానులను థ్రిల్ చేసింది. సిక్స్ ప్యాక్ ను మించిన ఫిజిక్ తో అఖిల్ స్పెల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక తాజాగా ఏజెంట్ కోసం అఖిల్ హార్స్ రైడ్ కూడా స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని అఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. “సండే రోజు తన గిజెల్లేతో గడిపిన మూమెంట్స్ అంటూ ఈ వీడియోకి ట్యాగ్ లైన్ యాడ్ చేశాడు అక్కినేని హీరో. ఈ వీడియోలో నీళ్లలో కూడా సూపర్ స్టైలిష్ గా హార్స్ రైడ్ చేయడం చూస్తుంటే అఖిల్ కాన్ఫిడెంట్ లెవెల్ వేర్ రేంజిలో కనిపిస్తుంది. మరి.., ఇంత కష్టపడుతున్నాడు కాబట్టి.., అఖిల్ ఏజెంట్ తో సూపర్ సక్సెస్ అందుకుంటాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.