టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాస్త దూకుడు పెంచారు. అటు రాజకీయాలు ఇటు సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా మారిన జనసేనాని షూటింగ్‌లతో బిజీ లైఫ్‌ను కొనసాగిస్తున్నాడు. వకీల్ సాబ్ తర్వాత సినిమాల్లో మళ్లీ జోరు పెంచి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు పవర్ స్టార్. ఇక విషయానికొస్తే..పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఆత్మరక్షణ కోసం కరాటే, కర్రసాము వంటివి నేర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో అనేక సినిమాల్లో ఆయన కరాటే ఫైటింగ్స్, కర్రసాము వంటివి చూశాం.
ఇక దీంతో తన తనయుడు అకిరా నందన్ కూడా తండ్రి తోవలోనే వెళ్తున్నట్లు తాజా వీడియో చూస్తే అర్ధమవుతోంది. అకిరా నందన్ కరాటేలో, కర్రసాములో శిక్షణ ఇప్పస్తున్నాడట పవర్ స్టార్. దీనికి సంబంధించిన ఓ వీడియోను తల్లి రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది. ఆత్మరక్షణతో పాటు సినిమాల్లోకి వచ్చే సమయంలో తనకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అకిరా త్వరలో ఓ సినిమాలో నటించనున్నాడని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర చంద్ర దర్శకత్వంలో అయ్యప్పునుమ్ కోషియమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరో దగ్గుబాటి రానా కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‌కు జోడిగా హీరోయిన్ సాయిపల్లవి నటిస్తోంది. దీంతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు అనే సినిమాలో సైతం నటించారు. ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉంది. మరి అకిరా నందన్ కర్రసాము నేర్చుకుంటున్న నేపథ్యంలో సినిమాల్లోకి రాబోతున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.<