అఖిల్ పేరు చెప్పగానే అందరికీ 'అయ్యగారు', 'నంబర్ వన్' ఇలా చాలా పేర్లు గుర్తొస్తాయి. ఇప్పుడు వాటిపై అఖిల్ ఫన్నీ రెస్పాన్స్ ఇచ్చాడు. అది కాస్త వైరల్ గా మారిపోయింది.
హీరో అఖిల్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు ‘అయ్యగారు’. అప్పుడెప్పుడో నాలుగేళ్ల క్రితం ఓ సినిమా రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని తెగ హడావుడి చేశాడు. ‘ఎవరి వల్ల కాదు అయ్యగారే నంబర్ వన్, అఖిలే నంబర్ 1’ అని ఫుల్ సందడి చేశాడు. అది జరిగిన దగ్గర నుంచి ఎప్పుడూ అఖిల్ కనిపించినా ‘అయ్యగారు’ అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. తాజాగా ‘ఏజెంట్’ ప్రమోషన్స్ లోనూ ఈ పేరు టాపిక్ వచ్చింది. దీనికి అఖిల్ ఫన్నీ రియాక్షన్ ఇవ్వడంతో పాటు దానిపై క్లారిటీ కూడా ఇచ్చేశాడు. దీంతో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున కొడుకుగా అఖిల్ చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు. ‘అఖిల్’ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాడు. అందులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మాత్రమే పర్వాలేదనిపించింది. అది తప్పితే సరైన హిట్ ఇప్పటివరకు లేదు. తాజాగా ఆ లోటుని భర్తీ చేసేందుకు ‘ఏజెంట్’గా వస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒకరు ‘అయ్యగారు’ బిరుదు గురించి ప్రస్తావించడంతో మరోసారి అఖిల్ రెస్పాండ్ కావాల్సి వచ్చింది.
‘మొదట్లో ‘అయ్యగారు అయ్యగారు’ అని పిలుస్తుంటే నన్నేనా అనుకున్నారు. వీడియో చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఇప్పుడు అక్కినేని కంటే అయ్యగారు అనేది నా ఇంటిపేరు అయిపోయింది. చెప్పాలంటే ఫ్యాన్స్ బలవంతంగా మార్చేశారు(నవ్వుతూ)’ అని హీరో అఖిల్ చెప్పుకొచ్చాడు. చెప్పడం మర్చిపోయాం.. ‘అయ్యగారు’ అనే స్లోగన్ కి కారణమైన వ్యక్తి పేరు నాగరాజు. సో అదన్నమాట విషయం. మరి అఖిల్ గుర్తుకురాగానే మీకు కూడా ‘అయ్యగారు’ గుర్తొస్తారా? ఒకవేళ అదే అయితే కింద కామెంట్ చేయండి.