Ajith: తమిళంలో క్రేజీ స్టార్డమ్ ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఈయన్ని అభిమానులు ప్రేమగా ‘తల’ అని పిలుస్తుంటారు. ఎంతో సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేసే అజిత్‌కు కార్లన్నా.. బైక్‌లన్నా ఎంతో ఇష్టం. వాస్తవానికి అజిత్ ఓ రేసర్ కూడా. ఖాళీ దొరికినపుడల్లా రేసింగ్‌కు వెళుతుంటారు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, వెకేషన్‌కు యూకే, యూరస్ టూర్‌కు వెళ్లారు. ఫారెన్ టూర్లో ఉన్న అజిత్ తన ఫ్రెండ్స్‌తో బైక్ రైడ్ చేస్తున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన లండన్‌లో పర్యటిస్తున్నారు. లండన్ పర్యటనలో భాగంగా అత్యంత ఖరీదైన కార్ల షోరూంను సందర్శించారు. మెక్లారెన్ లగ్జరీ కార్ల షోరూముకు వెళ్లారు. మెక్లారెన్ లగ్జరీ కార్లను చూసి సంతోషించారు. ఓ కారులో ఫొటో కూడా దిగారు. ఆ కారు ధర దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ మెక్లారెన్ లగ్జరీ కార్లు ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి.
ప్రముఖ బాలీవుడ్ హీరో కార్తీన్ ఆర్యన్‌కు నిర్మాత భూషన్ కుమార్ మెక్లారెన్ జీటీ కారును కానుకగా ఇచ్చారు. దీని ధర. 3.75కోట్లు. ఈ కారు ఇండియాలోనే ఇదే మొదటిది కావటం విశేషం. ఇక, అజిత్ మెక్లారెన్ లగ్జరీ కారుతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ విత్ కూలింగ్ గ్లాస్‌తో.. ఎంతో స్టైలిష్‌గా ఉన్నారాయన. అజిత్ కారుతో దిగిన ఫొటోపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన మెక్లారెన్ కారును కొన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, అజిత్ మెక్లారెన్ కారును కొనటానికి షోరూంకు వెళ్లారా? లేక కేవలం కార్ల మీద ఉన్న ప్రేమ కొద్దీ చూడటానికి వెళ్లారా అన్నది అంతుచిక్కని విషయం.
కాగా, అజిత్ నటించిన తాజా చిత్రం ‘వలిమై’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వలిమై తర్వాత ఏకే 61కు ఆయన పచ్చజెండా ఊపారు. వినోద్ హెచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ప్యాకెడ్గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. జనవరి 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అజిత్ లండన్ టూరు తర్వాత ఏకే61 షూటింగ్లో పాల్గొంటారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మెక్లారెన్ లగ్జరీ కారుతో అజిత్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Prudhvi Raj: YSRCPపై నటుడు పృధ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు
Pure Classy Look Of #AjithKumar With #McLaren #Ajith #AKinUK 🔥🔥 pic.twitter.com/EJ8DieAVrT
— SumanTV (@SumanTvOfficial) June 25, 2022