తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్, అజిత్ పోటా పోటీగా నిలుస్తారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో తెలుగు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళ నాట మంచి విజయాలు అందుకొని అక్కడే స్థిరపడ్డాడు. తన సహనటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. స్టార్ హీరో అయినప్పటికీ ఎంతో సింపుల్ లైఫ్ గడుపుతుంటారు అజిత్. తాజాగా అజిత్ నటించిన తునిపు మూవీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో సంక్రాంతి కానుకగా అజిత్ నటించిన తునివు, విజయ్ నటించి వారిసు చిత్రాలు సందడి చేశాయి. మొదటి నుంచి ఈ ఇద్దరు హీరోల చిత్రాలు రిలీజ్ కి ముందే భారీ అంచనాలు ఉంటాయి. అయితే హీరో అజిత్ తన సినిమాల ప్రమోషన్ లో ఎక్కువగా పాల్గొనరు అంటారు. అంతేకాదు హిట్, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటారు అజిత్. అయినా కూడా అజిత్ సినిమాలను ఆడియన్స్ బాగా ఆదరిస్తుంటారు. ఈ క్రమంలో జనవరి 11న అజిత్ నటించిన ‘తునివు’ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. మొదట ఈ మూవీ మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్మురేపింది.
తునివు మూవీ రూ.250 కోట్ల కలెక్షన్లు సాధించి అజిత్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా సరికొంత్త రికార్డు క్రియేట్ చేసింది. మొత్తానికి ఈ ఏడాది విజయ్‌తో సాగిన పోరులో అజిత్ కొత్త రికార్డు సృష్టించాడు. వాస్తవానికి ఈ మూవీ మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మెల్లి మెల్లిగా పెరుగుతూ వచ్చాయి. ఈ మూవీ తెలుగు లో ‘తెగింపు’ గా డబ్ చేశారు. గతంలో అజిత్ నటించిన మూవీస్ తెలుగు లో డబ్ చేశారు.. వాటితో పోల్చుకుంటే తెగింపు మంచి బిజినెస్ చేసిందని టాలీవుడ్ టాక్. మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 8 నుండి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి తమిళనాట తునిపు చిత్రంతో అజిత్ సెన్సెషన్ రికార్డు క్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
#AK ‘s #Thunivu has grossed more than
₹ 250 Crs+ at the WW Box office.. 🔥 #AK ‘s Highest Grosser..— Ramesh Bala (@rameshlaus) February 6, 2023