ఈ మద్య దొంగలు సామాన్యులే కాదు సెలబ్రెటీలను వదలడం లేదు. పక్కా స్కెచ్ తో చోరీలకు పాల్పపడుతున్నారు. సెలబ్రెటీల ఫిర్యాదు మేరకు సీసీ టీవీలను ఫాలో చేసి నింధితులను పట్టుకుంటున్నారు పోలీసులు.
ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పపడుతున్నారు. దొరికితే దొంగలు లేదంటే దొరల్లా చెలామణి అవుతున్నారు. గత కొంతకాలంగా దొంగలు సెలబ్రెటీల ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, ప్రముఖ నిర్మాత ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఐశ్వర్య ఇంట్లో లాకర్ లో ఉన్న లక్షల విలువైన నగలు, వజ్రాలు చోరీకి గురైనట్లు సమాచారం. దీంతో ఆమె చెన్నై తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ప్రముఖ నటుడు ధనుష్ ని వివాహవం చేసుకుంది. ఇటీవల ఈ జంట విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐశ్వర్య ఇంట్లో ఉన్న లాకర్ లో ఉన్న వజ్రాలు, అరమ్ నెక్లెస్ తో పాటు 60 సవరీల గాజులు కనిపించకుండా పోయాయని చెన్నై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాటి విలువ లక్షల్లో ఉంటుందని.. తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఎత్తుకెళ్లి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి ఆ నగలను ఉపయోగించిన తర్వాత వాటిని తన లాకర్‌లో ఉంచినట్లు ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇటీవల హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారు. 2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి నగలు వేసుకున్న వాటిని తన లాకర్‌లో ఉంచానని.. తర్వాత 2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సేయింట్ మేరీస్ రోడ్డు లోని తన అపార్ట్ మెంట్ లో ఉంచానని.. హీరో ధనుష్ తో కలిసి ఉన్న సమయంలో వాటిని అక్కడికి మార్చినట్లు పేర్కొంది. 2022 లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి షిఫ్ట్ చేసినట్లు ఐశ్వర్య తెలిపింది. ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు అపార్ట్ మెంట్ లోని ఉంటాయని.. వాటి గురించి తన ఇంట్లో పనిచేసే ముగ్గురికి తెలుసునని.. తన నగలు, వజ్రాలు, బంగారు గాజులు కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న తేనాంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేస్తున్న ముగ్గురిని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి ‘లాత్ సలామ్’ అనే మూవీకి దర్శకత్వం వహిస్తుంది.. ఇందులో రజినీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.