ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాల హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. అందులోనూ కన్నడ సినిమాల జోరు బాగా సాగుతోంది. కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ, 777 చార్లీ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తర్వాత.. కొత్తగా ‘కాంతార‘ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. కన్నడతో పాటు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మొదటిసారి తుళు సంస్కృతి, సాంప్రదాయానికి సంబంధించి భూతకోలం, వరాహ దైవం నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి, రూపొందించిన కాంతార.. తుళునాడుకు చెందిన భూతకోల నాట్యం గురించి కమర్షియల్ హంగులతో చర్చించిన సినిమా ఇది. అయితే.. కాంతార సినిమా కథాకథనాల సంగతి పక్కన పెడితే.. రిషబ్ శెట్టి పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే కాంతార మూవీ తెలుగులోను అధిక లాభాలు రాబట్టగా.. ఈ సినిమాను పోలిన మరో సినిమా తాజాగా వెలుగులోకి వచ్చింది. కాంతార చిత్రంలో చూపించిన భూతకోల నాట్యం, తుళు సంస్కృతి సాంప్రదాయాలను ఆధారం చేసుకొని 2019లోనే ‘పింగారా’ అనే చిత్రం రూపొందింది.
కన్నడ, తుళు భాషలో తెరకెక్కిన పింగారా చిత్రం.. 67వ నేషనల్ అవార్డ్స్ లో ‘ఉత్తమ తుళు చిత్రం’గా అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. అయితే.. ఎలాగో కొత్త తరహా కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ పింగారా మూవీని కూడా డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేయనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. కాంతార కంటే ముందే వచ్చింది కనుక పింగారా మూవీలో కన్నడ సంసృతీ, సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. కాకపోతే కాంతారలో ఉన్న కమర్షియల్ అంశాలేవీ పింగారాలో కనిపించవు. ప్రీతమ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో ఉషా భండారి, సించన చంద్రమోహన్, గురుప్రసాద్ హెగ్డే ప్రధానపాత్రలు పోషించారు. మరి త్వరలో తెలుగులో రిలీజైతే.. పింగారా మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!
Congratulations to producer Avinash Shetty for receiving the nations award for #Pingara movie #chitraloka #avinashushetty #natinalaward pic.twitter.com/up42AWHEVb
— Chitraloka.com (@chitraloka) October 26, 2021
PINGARA Tulu film won the 67th national film award for the year 2019. This movie was also adjudged best asian Film by NETPAC in 2020..😍#NationalAward #TuluFilm #Pingara #TuluLanguage #NationalFilmAwards pic.twitter.com/SfAoTqiEu1
— Beauty of Tulunad (@beautyoftulunad) March 23, 2021