ఈ హీరోయిన్ రీల్ లైఫ్ విలన్ ని రియల్ లైఫ్ లో ఇష్టపడింది. అతడితోనే డేటింగ్ చేస్తోంది. తెలుగులో 10 సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ని మీలో ఎవరైనా గుర్తుపట్టారా?
ఏ సినిమా తీసుకున్నా హీరోయిన్ హీరోని లవ్ చేస్తుంది. విలన్ అంటే ద్వేషం చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మాత్రం రీల్ విలన్ ని రియల్ లైఫ్ లో ప్రేమిస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు కూడా! చెప్పాలంటే ఈ బ్యూటీ తెలుగులో 11 సినిమాలు చేసింది. అందులో జగపతిబాబుతోనే మూడు-నాలుగు చేయడం విశేషం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమెకి 41 ఏళ్లు. ఫిజిక్ చూస్తే మాత్రం అస్సలు అలా అనిపించదు. ఎవరినైనా సరే మెంటలెక్కించేస్తుంది. బహుశా పెళ్లి చేసుకోకపోవడం అలా ఉందేమో! మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళ మూలాలున్న ఈ హీరోయిన్ పుట్టి ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. అక్కడ మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఇక్కడికి వచ్చింది. 2006లో తమిళ ‘పోయ్’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ఒరియా భాషలోనూ నటించింది. అక్కడ నుంచి తెలుగు, తమిళ, మలయాళంలో వరసపెట్టి సినిమాలు చేసింది. స్టిల్ ఇప్పటికీ తెలుగులో మూవీస్ చేస్తూనే ఉంది. ఆమెనే విమల్ రామన్. జగపతిబాబుతో ‘గాయం 2’, ‘చట్టం’ లాంటి మూవీస్ చేసింది. ప్రస్తుతం వీళ్ల కాంబోలో ‘రుద్రంగి’ రిలీజ్ కాబోతుంది.
2009లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఎవరైనా ఎప్పుడైనా’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాజ్, చట్టం, నువ్వానేనా లాంటి మూవీస్ చేసింది. చివరగా 2017లో వచ్చిన ‘ఓం నమో వెంకటేశాయ’లో నటించింది. ప్రస్తుతం ఛాన్సులు పెద్దగా రాకపోవడంతో సిడ్నీలోనే ఉంటోంది. అయితే రీసెంట్ గా ఈమె ఇన్ స్టాలో పిక్స్ చూసిన నెటిజన్స్ పిచ్చెక్కిపోతున్నారు. 40 ఏళ్ల వయసులోనే ఈ షేపులేంట్రా బాబోయ్ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం ఈమె విలన్ గా నటిస్తున్న వినయ్ రాయ్ తో డేటింగ్ లో ఉంది! అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. మరి ఈ హీరోయిన్ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.