ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. ఇక సినిమా రీలీజ్ అంటే వారి ఆనందాలకు హద్దులే ఉండవు. ఒక రకంగా అలాంటి వారి అండ దండలతోనే తమ క్రేజ్ ని పెంచుకుంటూ ఉంటారు నటీనటులు. అందుకే తమ వీరాభిమానులను సెలబ్రెటీలు ఫ్యామిలీ మెంబర్స్ లా చూస్తుంటారు. వారికి ఏదైనా వెంటనే స్పందిస్తుంటారు.
ఒకప్పుడు ఫ్యాన్స్ తమ అభిమాన నటుల్ని కలవాలి అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ సోషల్ మీడియా వచ్చాక ఆ దూరం చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. నటీనటులు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఇక నటీనటుల ఫ్యాన్స్ పేజెస్ కి కూడా సపోర్ట్ చేస్తూ ఆ పేజెస్ తో కాంటాక్ట్ లో ఉంటున్నారు. ఇదే కోవలో ఓ త్రిష అభిమాని ట్విట్టర్ లో త్రిష ఫాన్స్ పేజీని మొదలు పెట్టి దాన్ని రెగ్యులర్ గా నడిపించాడు. దాదాపు ఈ పేజీని లక్ష మంది వరకు త్రిష ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఈ పేజీతో త్రిష కూడా కాంటాక్ట్ ఉంటుంది.
ఈ పేజీ పెట్టిన త్రిష వీరాభిమాని అయిన కిషోర్ ఇటీవల మరణించాడు. తన అభిమాని చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది. తన గుండె బద్దలైందన్నట్టుగా చెప్పేసింది. ‘నీ మరణ వార్త విని నేను చాలా బాధపడుతున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి బ్రదర్. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తెలుగులో ఎప్పుడో ఫెడ్ అవుట్ అయిన ఈ చెన్నై బ్యూటీ.. 96 మూవీతో తమిళ్ లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
I am so devastated about this💔 Rip my brother and thank you for being you. https://t.co/OUiTSXXtco
— Trish (@trishtrashers) November 14, 2021