కెరీర్ మెుదటి నుంచి గ్లామర్ షోతో ఆకట్టుకున్న తమన్నా.. ప్రస్తుతం గ్లామర్ షోలో హద్దులు చెరిపేసినట్లు తెలుస్తోంది. తన కెరీర్ లో ఇప్పటి వరకు కనిపించని రీతిలో బెడ్ రూమ్ సీన్స్ లో నటించినట్లు సమాచారం.
చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందాలు ఆరబోస్తేనే అవకాశాలు లభిస్తాయి. అయితే ఇది కొద్ది మందికి మాత్రమే వర్తిస్తుంది. అందాలు ఆరబోయకుండానే అద్భుతమైన నటనతో అవకాశాలు దక్కించుకుంటారు కొందరు. ఇక మరికొందరు కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ అనుకున్నంత పేరు సంపాదించుకోలేక పోతుంటారు. దాంతో కెరీర్ చివరి దశలో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ.. రెచ్చిపోతుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం ఇదే దారిలో ఉన్నట్లు కనిపిస్తోంది. కెరీర్ మెుదటి నుంచి గ్లామర్ షోతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్లామర్ షోలో హద్దులు చెరిపేసింది. తన కెరీర్ లో ఇప్పటి వరకు కనిపించని రీతిలో బెడ్ రూమ్ సీన్స్ లో నటించి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.
తమన్నా.. కెరీర్ ఆరంభం నుంచి దాదాపుగా గ్లామర్ పాత్రల్లోనే మెరిసింది. అయితే ఎక్కడా మితిమిరిన లిప్ లాక్స్ గానీ రోమాంటిక్ సన్నివేశాల్లో నటించింది లేదు. ఇక ప్రస్తుతం తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి. పైగా విజయ్ వర్మ అనే బాలీవుడ్ నటుడు, నిర్మాతతో ప్రేమలో మునిగి ఉన్నట్లు వార్తలు సైతం వస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగా అతడితో చాలా సార్లు కెమెరాకు సైతం చిక్కింది ఈ భామ. ఇక సీనియర్ హీరోలు ఎవరూ తమన్నను తమ సినిమాలో పెట్టుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దాంతో ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ప్రస్తుతం తమన్నా నెట్ ఫ్లిక్స్ కోసం లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సిరీస్ లో రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో తమన్నాకు లవ్ ట్రాక్ ఉంటుందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు తమన్నని చూడని విధంగా చూడబోతున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ లో నటించని లిప్ లాక్స్ సీన్స్, హాట్ హాట్ బెడ్ రూం సీన్స్ లల్లో నటించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని సీన్స్ లీక్ కావడంతో.. అవును గ్లామర్ ప్రపంచానికి తమన్నా హద్దులు చెరిపేసింది అంటున్నారు నెటిజన్లు. మరి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ వస్తే గానీ తెలీదు తమన్నా ఇంకెంతగా రెచ్చిపోయిందో అని. ఇక లస్ట్ స్టోరీస్ సిరీస్ 1 లో నటించిన కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దుసుకెళ్తోంది. మరి ఈ సిరీస్ 2 తర్వాత తమన్నా సైతం కియారాలా దుసుకెళ్తుందో లేదో వేచి చూడాలి మరి.