Tabu: దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటీమణుల్లో టబు ఒకరు. 90లలో ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టబు. తెలుగు, హిందీల్లో టాప్ హీరోయిన్గా దశాబ్దాల పాటు కొనసాగారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక, నటి టబు వయసు 50 సంవత్సరాలు. అయినప్పటికి చాలా యంగ్‌గా కనిపిస్తుంటారు. చాలా ఇంటర్వ్యూల్లో ఆమె అందానికి రహస్యం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి. ఆమె సింపుల్‌గా ఏదో చెప్పేసి తప్పించుకున్నారు. అయితే, తాజాగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అందానికి రహస్యాన్ని చెప్పుకొచ్చారు.
ఓ సారి ముఖానికి రాసుకోవటానికి ఏకంగా 50 వేల రూపాయల ఫేస్ క్రీమ్ కొన్నట్లు ఆమె వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నా అందానికి ఎలాంటి సీక్రెట్ లేదు. ఓ రోజు నా మేకప్ ఆర్టిస్ట్ నన్నో ప్రశ్న అడిగింది ‘మేడమ్ మీ చర్మం చాలా అందంగా కనిపిస్తోంది. ఏదైనా ఇంటి చిట్కా పాటిస్తున్నారా? ఏంటి?’ అని అంది. నేను కాఫీ, కొన్ని మొక్కలు వాడతానని చెప్పాను. అప్పుడు తను ‘‘ మీరు అలా చేయకండి మేడమ్. మీరు ఈ క్రీమ్ వాడండి’’ అని ఓ క్రీమ్ పేరు చెప్పింది. ఆ క్రీమ్ ధర 50 వేల రూపాయలు. నేను దాన్ని కొన్నాను. వాడాను. కానీ, తర్వాత వాడకూడదని డిసైడ్ అయ్యాను.
ఎందుకంటే మనం మన చర్మం కోసం ప్రత్యేకంగా ఏదీ చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ, నేను కొంత బాగా కనిపించాలని నాకు తెలుసు. నేను మాత్రమే కాదు.. సాధారణ ప్రజలు కూడా అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకోసం ఏం చేయాలో చేస్తుంటారు. నేను కూడా నాకు చేతనైనది చేస్తున్నాను’’ అని అన్నారు. కాగా, టబు తాజాగా భూల్ భులయ 2లో ఓ కీలక పాత్ర చేశారు. డ్యూయల్ రోల్లో కనిపించారు. మరి, ముఖం కోసం 50 వేల ఫేస్ క్రీమ్ కొని, దాని వల్ల ఎలాంటి లాభం లేదని టబు రియలైజ్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తెలుగు ప్రేక్షకులపై అభిమానం కురిపించిన విక్రమ్, కార్తీ!