సినీ కెరీర్ లో నటీనటులకు అవమానాలు, బాధించే సంఘటలు ఎన్నో జరుగుతుంటాయి. అవి వారు టైం వచ్చినప్పుడే కెమెరా ముందు పెడుతుంటారు. ఇటీవల ప్రముఖ నటి సుధ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె లైఫ్ లో జరిగిన బాధాకరమైన సంఘటనలు బయటపెట్టారు. తెలుగు ప్రేక్షకులకు అటు కొరియోగ్రాఫర్ గా.. ఇటు ‘ఆట’ డాన్స్ షో జడ్జిగా సుందరం మాస్టర్ సుపరిచితమే.
సినీ ఇండస్ట్రీలో ఎన్నో వందల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన సుందరం మాస్టర్.. ఓ సినిమా విషయంలో ఘోరంగా తిట్టాడని సుధ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ”ముద్దుల మావయ్య తమిళ వెర్షన్ సినిమా కోసం పొలాచ్చిలో ఓ పాట షూటింగ్ జరిగే సమయంలో సుందరం మాస్టర్ ఓ డాన్స్ మూమెంట్ చెప్పారు. ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు ఆ మూమెంట్ రావడం లేదు.నాలుగైదు టేక్స్ తరువాత.. ‘ఛీఛీ! నువ్ వ్యభిచారాకి కూడా పనికి రావు’ అన్నారాయన. అందరిముందు అలా అనేసరికి నాకు ఏడుపు వచ్చేసింది. సెట్ లో ప్రభు గారు, పి. వాసు గారు అందరూ ఉన్నారు. తట్టుకోలేకపోయా.. వెంటనే ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాను. చిన్న ఆర్టిస్ట్ అయినా.. పెద్ద ఆర్టిస్ట్ అయినా.. అలా అనడం తప్పు. ఏడుస్తూ ఇంటికి వెళ్లి ఆయన సినిమాలో ఉంటే నేను చేయలేనని మా అమ్మతో చెప్పాను.
మా అమ్మ నువ్వు చేయాలని చెప్పింది. రేపు అతను డైరెక్టర్ అయిన తరువాత నిన్ను అతడి సినిమాలో చేయమని అడుగుతారు. తప్పకుండా చేయాలని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే 6 నెలల తరువాత సుందరం మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో అమ్మ రోల్ కోసం నా దగ్గరకు వచ్చారు. ఆయన్ని చూడగానే సినిమా చేయనని మా అమ్మతో చెప్పాను.అమ్మ నచ్చజెప్పి అతనికి నువ్ ఎలాంటి ఆర్టిస్ట్ అనేది తెలియాలి. అతని తప్పు తెలుసుకోవాలంటే నువ్ చేయాలి. ఆ వెంటనే అగ్రిమెంట్ పై సైన్ చేశాను. షూటింగ్ వెళ్లినప్పుడు ఫస్ట్ షాట్ లోనే ఓకే చేశారు. 2 పేజీల డైలాగ్ చాలా బాగా వచ్చిందని.. అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత సుందరం మాస్టర్ నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆ సినిమా నాకు చాలా పేరు తీసుకొచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటి సుధ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.