ఎవరైనా దేవుణికి ఎలా పూజ చేస్తారు? పూజ గదిని మంచిగా పూలతో అలంకరించి భక్తి భావంతో టెంకాయ కొట్టి, నెైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఇది కొందరి సాంప్రదాయం. కానీ ఓ నటి మాత్రం శ్రీకృష్ణుడి మీద ఉన్న ప్రేమను తన డ్యాన్స్ ద్వారా తెలియజెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీ కృష్ణ ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. అయితే ఈ క్రమంలోనే అలనాటి హీరోయిన్ శ్రియ శ్రీకృష్ణుడిపై తనకు ఉన్న భక్తిని తన క్లాసికల్ డ్యాన్స్ రూపంలో తెలిపింది. ఎప్పుడూ బీచ్ లో తన బేబీతో ఫొటోలు పెడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉండే శ్రియ ఒక్క సారిగా క్లాసికల్ డ్యాన్సర్ గా మారిపోయి తన టాలెంట్ అంతా బయటపెట్టింది.
స్వతాహగా శ్రియ కథాకళి డ్యాన్సర్ అని మనకు తెలుసు కానీ ఎప్పుడు అంతగా తన ఫర్పార్మెన్స్ చూసే చాన్స్ మనకు దక్కలేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు, అభిమానులకు సోషల్ మీడియా ద్వార జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు ప్రేమ, ఆనందాన్ని పంచుదాం అంటూ చిన్న కామెంట్ని షేర్ చేసింది శ్రియ. నేను కృష్ణుడిని నృత్యంలో చూస్తున్నాను, అది దైవానికి కనెక్ట్ అయ్యే నా మార్గం. మరీ మీ మార్గం ఏమిటో చెప్పమంటూ ప్రశ్నను నెటిజన్లకు వేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి తన భక్తిని ఇలా వైవిధ్యంగా శ్రియ తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.