సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు మెల్లగా పెళ్లి పీటలెక్కస్తూ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇటీవల కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ళతో వివాహ బంధంలో అడుగు పెట్టారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి జాబితాలో చేరబోతోంది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శివలీక ఒబెరాయ్.. ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో త్వరలోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఖుదా హాఫీజ్, దృశ్యం 2 సినిమాలు తెరకెక్కించిన అభిషేక్ పాఠక్. అదికూడా వీరిద్దరి లవ్ మ్యారేజ్ కావడం విశేషం.
అదేంటీ వీరిద్దరూ ఎలా లవ్ లో పడ్డారు? అనే డౌట్ రావచ్చు. కానీ.. ఈ జంట ఏకంగా పెళ్లి డేట్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 8, 9 రెండు రోజులపాటు గోవాలో వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. టైమ్ ఎంతో దూరం లేదు కాబట్టి.. త్వరగా పెళ్లి వేడుకలు స్టార్ట్ చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిషేక్ దర్శకత్వం వహించిన ఖుదా హాఫీజ్(2020) సినిమాలో శివలీక కూడా నటించింది. ఆ సినిమా షూట్ టైంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లి అనౌన్స్ మెంట్ కు సంబంధించి శివలీక పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక గతేడాది ఈ జంట టర్కీలో జూలైలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అభిషేక్ ఎవరో కాదు.. ప్రొడ్యూసర్ కుమార్ మంగత్ కుమారుడు కావడం విశేషం. మరి ఈ జంట ఎలా ఉందో మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.