పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి.. తెలుగులో అరడజనుకు పైగా సినిమాలు చేసిన హీరోయిన్. ఫిజిక్ చూస్తే మెంటలెక్కిపోవడం గ్యారంటీ. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఫస్ట్ మూవీతో హిట్ కొట్టడం చాలామంది హీరోయిన్లకు వర్కౌట్ అవుతుంది. కానీ దాన్ని నిలబెట్టుకుని కెరీర్ ని కంటిన్యూ చేసిన వాళ్లకే ఓ లెక్కుంటుంది. ఈమె కూడా అలా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. కానీ ఏం చేస్తాం కలిసి రాలేదు. హిట్స్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ బ్యూటీ దశ తిరిగిపోవడం గ్యారంటీ. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు హీరోయిన్లు అనగానే ఆల్మోస్ట్ అందరూ ముంబయి భామలే ఉంటారు. ఈ పిల్ల కూడా సేమ్ ఆ బాపతే. ముంబయిలో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి డైరెక్టర్ సుజీత్ కంట్లో పడింది. దీంతో తన ఫస్ట్ మూవీ ‘రన్ రాజా రన్’లో హీరోయిన్ గా తీసుకున్నాడు. హిట్ కొట్టేసరికి అందరికీ పేరొచ్చింది. యస్ మీరు గెస్ చేసింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు సీరత్ కపూర్. ఫస్ట్ మూవీ సక్సెస్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత టైగర్, రాజుగారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం లాంటి మూవీస్ చేసింది కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
2020లో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా లాంటి మూవీస్ ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి. కానీ హీరోయిన్ సీరత్ కి అయితే పేరు రాలేదు. ఈ ఏడాది ‘మారీచ్’ అనే హిందీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇలా ఓ పది సినిమాలు చేసినప్పటికీ పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. అలాంటి ఈ బ్యూటీని ‘పుష్ప 2’లో ఛాన్స్ వరించిందనే టాక్ బయటకొచ్చింది. రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసి ఈమె టైట్ హగ్ ఇచ్చి మరీ ఒప్పేసుకుంది. మరి ఇందులో ఎంత నిజముందనేది చూడాలి? మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.