సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల పై సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో హీరోయిన్లకు అభ్యంతరకరమైన మెసేజులు, వారి పోస్టుల కింద కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఈ విషయంలో హీరోయిన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం.. మళ్లీ కొంతకాలానికి సీన్ రిపీట్ అవ్వడం కామన్ అయిపోయింది. తాజాగా హీరోయిన్ సంజన గల్రాని.. తనకి ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు పంపాడని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.
ఆ సందేశాలు పంపిన వ్యక్తి కూడా సంజనకి పరిచయస్తుడు కావడం గమనార్హం. నటి సంజన ప్రస్తుతం పెళ్లి చేసుకొని వివాహ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి తరుణంలో పరిచయమున్న ఆడం బిడ్డప్ప అనే ఫోటోగ్రాఫర్.. తనకు ఇటీవల ఓ అర్ధరాత్రి తనకు వాట్సాప్ ద్వారా అశ్లీల సందేశాలు, వీడియోలు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆడం బిడ్డప్పను పిలిచి విచారించారు.ఈ విచారణలో.. తాను ఎలాంటి అశ్లీల సందేశాలు సంజనకి పంపలేదని అతడు తెలిపాడు. వెంటనే పోలీసులు అతని ఫోన్ చెక్ చేయగా అందులో ఎలాంటి మెసేజులు, ఆధారాలు దొరకలేదు. ఇక పోలీసులు అతని ఫోన్ని ఫొర్సెనిక్ ప్రయోగశాలకు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు విచారణలో సమాచారం. ఇదిలా ఉండగా.. సంజన గల్రాని తెలుగులో బుజ్జిగాడు సినిమాలో నటించింది. అలాగే స్వర్ణఖడ్గం అనే టీవీ సీరియల్ లో కూడా కనిపించింది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.