టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయిన సమంత దగ్గరు ఉన్న 5 ఖరీదైన వస్తువులు చూస్తే మన మతి పోవాల్సిందే. అదీకాక మరే ఇతర హీరోయిన్స్ దగ్గర లేని విలువైన వస్తువులు సమంత దగ్గర ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే మన మనసులో కొన్ని విషయాలు మెదులుతాయి. ఖరీదైన విల్లాలు, కార్లు, వెకేషన్స్ లాంటివి గుర్తుకు వస్తాయి.అయితే అందరు సెలబ్రిటీల అభిరుచులు ఒకే రకంగా ఉండవు. దాంతో వారి వారి కలెక్షన్లలో తేడాలు ఉంటుంటాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ హీరోయిన్ సమంత దగ్గర ఉన్న 5 ఖరీదైన వస్తువులు ఎవ్వరికీ లేవని తెలుస్తోంది. మరి సమంత దగ్గర ఉన్న ఆ ఖరీదైన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సమంత.. ఏమాయ చేశావే అంటూ తొలి చిత్రంతోనే కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. స్టార్ హీరోలతో నటిస్తూ.. హిట్స్, సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది సామ్. తాజాగా సామ్ ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇక సెలబ్రిటీల దగ్గర ఎన్నో రకాల ఖరీదైన వస్తువులు ఉంటాయి. అయితే సమంత దగ్గరు ఉన్న ఈ 5 ఖరీదైన వస్తువులు మాత్రం ఏ హీరోయిన్ దగ్గర లేవని తెలుస్తోంది.
సమంత దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులలో ఆమె చెప్పులు ఒకటి.మలానో బ్లహనిక్స్ కంపెనీకి చెందిన ఈ చెప్పుల ఖరీదు అక్షరాలా రూ. లక్ష రూపాయాలు కావడం విశేషం. ఇక సామ్ దగ్గర ఉన్న మరో విలువైన వస్తువు ఆమె హ్యాండ్ బ్యాగ్. ప్రతి లేడీ సెలబ్రిటీలకు హ్యాండ్ బ్యాగ్ లు అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. ప్రస్తుతం సమంత వాడే హ్యాండ్ బ్యాగ్ గుస్సీ కంపెనీకి చెందినది. దీని ధర రూ. 1.40 లక్షల రూపాయాలుగా తెలుస్తోంది. ఇదే కాకుండా మరో విలువైన బ్యాగ్ కూడా సమంత చేతిలో ఉంది. ఈ బ్యాగ్ ధర రూ. 2.5 లక్షలు.
ఇక సమంత వాడే క్లాంతింగ్ బ్రాండ్స్ కూడా అత్యంత ఖరీదైనవి. తన సొంత కంపెనీ అయిన సాకీ వరల్డ్ బ్రాండ్స్ నే సామ్ వాడుతుంటుంది. ఇవి చాలా ఎక్స్ పెన్సీవ్. ఇక చివరిగా సమంత ఉంటున్న ఇల్లు చాలా ఖరీదైనది. జూబ్లీహిల్స్ లో ఉన్న ఈ ఇంటిని చూస్తే.. చిన్న పాటి ఇంద్ర భవనాన్నే తలపిస్తుంది. సకల సౌకర్యాలు ఈ ఇంటిలో ఉన్నాయి.మరి సమంత దగ్గరు ఉన్న ఈ ఖరీదైన వస్తువులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.