‘వెళ్లవయ్యా వెళ్లు’.. అంటూ ‘జయం’ సినిమాలో నటించి కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి.. సదా. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఓ రేంజ్ లో క్రేజ్ సంపాందించింది ఈ అమ్మడు. ఆ తర్వాత దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది సదా. కొన్నాళ్లకు ఆమె సినీ కెరీర్ ఆశించనంతగా సాగలేదు. అడపదడప కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ ఆమె కెరీర్ అనుకున్నంత సక్సెస్ ఫుల్ గా లేదు. ఈ క్రమంలో బుల్లితెరపై కొన్ని షోల్లో జడ్డీగా సదా వ్యవహరిస్తుంది. ఇటీవల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో సదా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ తో ఆమె మరో విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నా సదా.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
సదా మాట్లాడుతూ..”ఉదయ్ కిరణ్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికీ నాకు తెలియదు. అయితే ఓ మంచి నటుడిని కోల్పోవడం మన దురదృష్టం. ఉదయ్ తో కలిసి ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలో నటించాను. ఈ సినిమాతో కలిపి ఆయన నటించిన కొన్ని సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆయన కెరీర్ లో ఎక్కడ తప్పు దొర్లిందో నాకు తెలియదు. ఒకవేళ మనం ప్లాన్ చేసుకున్నట్లు కెరీర్ లేదనే అనుకుందాం.. అయితే ఏంటి? జీవితం కంటే ఏదీ గొప్పది కాదు. ఓ సినిమా బాగా ఆడుతుంది.. తర్వాత సినిమా బాగా ఆడలేదని చాలా మంది నటీనటులు డిప్రెషన్‌కు గురతుంటారు.
అలాంటి విషయాలను నేనెంటిన్నో విన్నాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. జీవితం అంటేనే పోరాటం… సమస్య వచ్చినప్పుడు చావే పరిష్కారం కాదు. ఒక యాక్టర్ గా మనం బెస్ట్ ఇవ్వాలని… ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది” అని సదా తెలిపింది. ఈ అమ్మడు ఇటీవల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ తో ఆమె మరో విజయాన్ని అందుకుంది. మరి.. ఉదయ్ కిరణ్ పై సదా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.