ప్రముఖ తమిళ నటి రైజా విల్సన్ ప్రస్తుతం సోషల్ మీడియాను విషాదంలో ముంచేశారు. కొద్దిరోజుల క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తున్నాయి.
ప్రముఖ తమిళ నటి రైజా విల్సన్ ప్రస్తుతం సోషల్ మీడియాను విషాదంలో ముంచేశారు. నిన్న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె ఏడుస్తూ ఉండటం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఆమె ఎందుకు ఈ ఫొటోలు పెట్టారు. ఆమె ఏడవటానికి గల కారణం ఏంటన్నది తెలియరావటం లేదు. ఆమె కూడా తాను ఏడవటానికి గల కారణాలు ఏవీ చెప్పలేదు. దీంతో ఫ్యాన్స్ ఏమీ అర్థంకాక అల్లాడిపోతున్నారు. అయితే, కొంతమంది సెలెబ్రిటీలు మాత్రం ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవి ప్రకాశ్ ఆ ఫొటోలపై స్పందిస్తూ..
‘‘నీవు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మేమంతా నీతో ఉన్నాము’’ అని పేర్కొన్నారు. హీరోయిన్ మంజిమా మోహన్ స్పందిస్తూ.. ‘‘ అది కూడా ఏమీ చేయలేదు. ధైర్యంగా ఉండు’’ అని పేర్కొన్నారు. నటి ఫరినా ఆజాద్ స్పందిస్తూ.. ‘‘ ఏమీ కాదు’’ అని అన్నారు. కాగా, రైజా విల్సన్ ‘ప్యార్ ప్రేమ కాదల్’..‘‘ కాఫీ విత్ కాదల్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమాలో ఆమె నటనకు గాను డెబ్యూట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ వర్మలో కూడా ఆమె నటించారు. 2022లో వచ్చిన ‘ఎఫ్‌ఐఆర్’ సినిమాలోనూ ఆమె నటించారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆమె పేరు ప్రతీ ఇంటికి పాకిపోయింది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో దూసుకుపోతున్నారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం అశ్రద్ధ చేయరు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి, నటి రైజా విల్సన్ ఏడుస్తున్న ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.