తెలుగు ఇండస్ట్రీలో కన్నడ నాట నుంచి వచ్చిన హీరోయిన్లు ఎంతో మంది తన సత్తా చాటుకున్నారు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి ప్రేమ. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మ చక్రం చిత్రంలో ప్రేమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ మంచి హిట్ అయ్యింది. తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆమెకు అనుకున్నంత స్టార్ డమ్ రాలేదు. దాదాపు 14 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ‘అనుకోని ప్రయాణం’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది.
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం.. అందుకే స్ట్పోర్స్ వదిలి ఇండస్ట్రీవైపు వచ్చాను. ఉపేంద్ర హీరోగా స్వియ దర్శకత్వంలో వచ్చిన ‘ఓం’ చిత్రంలో నటించినందుకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నాకు వరుస ఛాన్సులు వచ్చాయి. షూటింగ్ సమయంలో ఉపేంద్ర ప్రవర్తిచే తీరు నన్ను చాలా బాధపెట్టింది.. ఒకసారి కలర్స్ తీసుకొని ముఖంపై చల్లారు.. అది నా కళ్లలో పడి చాలా సేపే నరకం అనుభవించాను, ఆయనకు అసలు మానకత్వం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నటి ప్రేమ చేసి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపడంతో ఉపేంద్ర అభిమానులు ప్రేమపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై హీరో ఉపేంద్ర స్పందించి.. తన సినిమా పర్ఫెక్ట్ గా రావడం కోసమే నేను అలా ప్రవర్తించి ఉంటానని.. ఆడవాళ్లు అంటే నాకు ఎంతో గౌరవం అని.. బాహుషా ఆ సమయంలో ప్రేమ నా ప్రవర్తన వల్ల బాధపడి ఉండొచ్చని.. ఆమె ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తుకు పెట్టుకొని తనను ద్వేషిస్తుందని ఊహించలేదని అన్నారు. కొంతకాలం తర్వాత వీరి మద్య ఆ సమస్య తొలగిపోయింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోకి ప్రేమ ‘అనుకోని ప్రయాణం’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.