సీనియర్ నటి ప్రగతి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాల్లో తల్లి, వదిన, అత్త, వంటి అనేక విభిన్నమైన పాత్రల్లో నటించింది. ఇంకా మరెన్నో పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను కడుబ్బా నవ్విస్తోంది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలకు తల్లి నటించి.. మెప్పించింది. ప్రగతి.. ఒక వైపు సినిమాలో బిజిగా ఉంటూనే మరొవైపు సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. తాజాగా వైట్ మినీ డ్రెస్ వేసుకుని అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలతో నటి ప్రగతి వారెవ్వా అనిపిస్తుంది. జిమ్ లో వర్కవుట్ వీడియోలు, పలు పాపులర్ పాటలకు, మాస్ పాటలకు హాట్ హాట్ స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తుంది. 2020 లో మొదటి లాక్ డౌన్ పడినప్పుడు మొదలైన ప్రగతి డ్యాన్స్ వీడియోల రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చీర కట్టులోనే బండి నడిపి.. ప్రగతి అందరిని ఆకట్టుకుంది. అంతే కాక తన టాటూ ఫోటోస్ ను కూడా పోస్ట్ చేసింది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలోని ఓ పాటకు లుంగీ కట్టి.. డ్యాన్స్ చేసి.. అందరికి షాక్ ఇచ్చింది. 4 పదుల వయస్సులో కూడా తన ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. తాజాగా ప్రగతి మరో హాట్ డ్యాన్స్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
స్నేహమురళి అనే యువతితో కలిసి ‘చెయ్యా చెయ్యా’ అనే హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోను అన్నట్లు ప్రగతి డ్యాన్స్ చేసింది. వైట్ మినీ డ్రెస్ లో ఓ ఇంటి ముందు ప్రగతి చేసిన డ్యాన్స్ కి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ వీడియోను ప్రగతి..తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. నటి ప్రగతి చేసిన డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.