ఎన్జీఎస్పీ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ వడ్డి, క్రిష్ కురుప్, అజయ్, రాజీవ్ కనకాల నటీ నటులుగా కృష్ణ కుమార్ అసూరి దర్శకత్వంలో నాగిరెడ్డి తారక ప్రభు, ఏ. హనీఫ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నీకై నేను”. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ హీరో హీరోయిన్ లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ యస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం దర్శకుడు కృష్ణ కుమార్ అసూరి మాట్లాడుతూ.. ‘‘నేను గతంలో ప్రభాస్ నటించిన రాదేశ్యామ్ సినిమా స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో కొంత వర్క్ చేశాను. ఆ తరువాత నేను ప్రిపేర్ చేసుకొన్న ఈ కథను నిర్మాతలకు చెప్పగానే వారికి నచ్చి సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఇక కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గరలో ఉండే ఘాట్ రోడ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న క్రైమ్, లవ్ స్టోరీ “నీకై నేను”. ఈ సినిమా సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు. నిర్మాత నాగిరెడ్డి తారక ప్రభు మాట్లాడుతూ..‘‘వ్యాపారవేత్తనైన నాకు సినిమాలపై ఆసక్తి. ఈ క్రమంలోనే మంచి సినిమా తీద్దాం అనుకుంటున్న సమయంలో దర్శకుడు కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చింది.. ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ మునార్లో జరుగుతుంది. ఈ సినిమాను సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నాము” అని తెలిపాడు. ఇది కూడా చదవండి: చై- సామ్ విడిపోవడంపై సమంత తండ్రి ఎమోషనల్ పోస్టు..!