బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో కుర్రాళ్ల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె గురించి తరచూ ఏదో ఓ వార్త వస్తునే ఉంటుంది. ఇప్పటికే పలు అవార్డులతో మెరిసిన ఈ బాలీవుడ్ భామకు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ లో అత్యుత్తమ సాధకుల పురస్కారం దక్కింది. పరిణీతి చోప్రాకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం బ్రిటన్ లోని లండన్ లో జరిగిన ఓ వేడుకలో ఇండియా-యూకే పురష్కారాలను ప్రకటించారు. అందులో భాగంగా పలువురు భారతీయ ప్రముఖలకు ఈ అవార్డులు వరించాయి. నటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి చద్దాం, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, భారత మహిళ పుట్ బాల్ జట్టు గోల్ కీపర్ అదితి చౌహాన్ తదితరులకు ఇ ఇండియా-యూకే అత్యుత్తమ సాధకులుగా గౌరవ పురస్కారాలు దక్కాయి. లండన్ లోని బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లో చదివిన భారతీయ విద్యార్థుల విజయాలకు గుర్తుగా ఈ అవార్డులు ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులతో ఈ సంయుక్త వేడుకను ఏర్పాటు చేశారు. ఈ అవార్డుల ఎంపిక కోసం నిపుణల జ్యూరీ వెయ్యి దరఖాస్తులను పరిశీలించి.. చివరికి వీరిని ఎంపిక చేసింది. గతేడాది 1.20 లక్షల మంది భారతీయ విద్యార్ధులు బ్రిటన్ లో విద్యాభ్యాసానికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. మరి.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో పాటు మరికొందరికి ఈ అత్యుత్తమ సాధకులు పురస్కారం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.